Asianet News TeluguAsianet News Telugu

తొక్కలో గేమ్ నేను షూ క్లీన్ చేయడం ఏంటి? బిగ్ బాస్ తో పునర్నవి ఫైట్!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 52 ఎపిసోడ్‌లను పూర్తి చేసి బుధవారం నాటితో 53వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
 

punarnavi serious warning to bigg boss
Author
Hyderabad, First Published Sep 12, 2019, 7:36 AM IST

లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన 'ఇంట్లో దెయ్యం నాకేంటి భయం 'టాస్క్ మొదటిరోజు పునర్నవి బిగ్ బాస్ పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తన కోపాన్ని రెండో రోజు కూడా కంటిన్యూ చేసింది. టాస్క్‌లు ఇచ్చేటప్పుడు సరిగా ఇవ్వాలని.. వాళ్లకు ఒకలా మాకు ఒకలా చెప్పే పిచ్చి టాస్క్‌లు ఇవ్వొద్దని.. ఎప్పుడు బిగ్ బాసే రైట్ అనుకోవద్దు. నువ్ ఎప్పుడూ రైట్ కాదు అంటూ బిగ్ బాస్ పై మండిపడింది.

ఇక ఈ టాస్క్ లో బాబా భాస్కర్, హిమజలు మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారని.. కాని శ్రీముఖి, పునర్నవి, మహేష్ విట్టాలు ఈ టాస్క్‌ని తేలికగా తీసుకున్నారని బిగ్ బాస్ తన అభిప్రాయాన్ని చెబుతూ ఈ ముగ్గుర్నీ చెత్త పెర్ఫామర్స్‌గా ప్రకటించారు.దీనికి శిక్షగా.. శ్రీముఖి, పునర్నవి, మహేష్‌లకు లగ్జరీ బడ్జెట్ ఈ ముగ్గురికి లభించదన్నారు. దాంతోపాటు వీరికి శిక్ష కూడా వేశారు.

షూ పాలిష్ చేయాలని ఒక్కొక్కరికీ వందకి పైగా షూలను ఇచ్చారు. వీటితో పాటు మిగతా ఇంటి సభ్యుల షూలను కూడా క్లీన్ చేయాలని శిక్ష విధించారు. దీనికి పునర్నవి ఓ రేంజ్ లో బిగ్ బాస్ పై మండిపడింది. శిక్ష దేనికి వేశారు.. చెత్త టాస్క్ ఇచ్చింది బిగ్ బాస్. దానికి నేను ఎందుకు షూ క్లీన్ చేయాలి అంటూ ఫైర్ అయింది. తనను ఇష్టమోచ్చినట్లుగా హ్యాండిల్ చేసి పూల్ లోకి తోసేసి, దెబ్బలు తగిలేలా చేస్తే ఇప్పుడు తనకు శిక్ష వేయడంపై బిగ్ బాస్ ని తప్పుపట్టింది పునర్నవి.  

తను ఈ శిక్షని అనుభవించనని ఖరాఖండిగా చెప్పేసింది. చెత్త టాస్క్‌లు ఇస్తే నేను ఎందుకు బాధ్యత వహించాలని ప్రశ్నించింది. దెబ్బలు తగిలించుకుని గేమ్ ఆడితే చెత్త పెర్ఫామెన్స్ అని ఎలా అంటారు అని కన్నీళ్లు పెట్టుకుంది పునర్నవి. తనను ఎంతమంది కన్విన్స్ చేసినా.. వెనక్కి తగ్గని పునర్నవి ఇంటి నుండి వెళ్లిపోవడానికి సిద్ధమైందే తప్ప బిగ్ బాస్ ఇచ్చిన శిక్షను మాత్రం అనుభవించడానికి ఒప్పుకోలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios