అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన చిత్రం `ఏజెంట్` నేడు విడుదలైంది. దీనికి డివైడ్ టాక్ వస్తోంది. అంతేకాదు సినిమా విషయంలో జరిగిన తెరవెనుక రహస్యం ఒకటి బయటకు వచ్చింది. ఇది హాట్ టాపిక్ అవుతుంది?
యంగ్ హీరో అక్కినేని అఖిల్ తాజాగా `ఏజెంట్` చిత్రంతో వచ్చారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి నెగటివ్ టాక్ వస్తుంది. బలహీనమైన కథ, ఓవర్ డోస్ యాక్షన్, ఎమోషన్స్ పండకపోవడం వంటి నెగటివ్ కామెంట్లు వినిపిస్తున్నారు. `ఏజెంట్`తో సక్సెస్ కొట్టాలన్న అఖిల్ లక్ష్యం నెరవేరలేదని, ఈ సినిమా కోసం ఆయన పడ్డ శ్రమ వృధా అవుతున్నాయనే బాధ అటు యూనిట్‌ని, అభిమానులను వెంటాడుతుంది. సినిమా రిజల్ట్ తేడా కొట్టే ప్రమాదం ఉందని అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువైంది. సుమారు రూ.80కోట్ల అయ్యిందనే ప్రచారం జరిగింది. కానీ 60-70 కోట్ల వరకు అయిన మాట నిజమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అయితే మొదట ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ 50 కోట్లు. కానీ సినిమా డిలే కావడంతో బడ్జెట్ ఇరవై కోట్లకుపైగా పెరిగిందని తెలుస్తుంది. మధ్యలో దర్శకుడు సురేందర్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు చాలా సీరియస్ అయ్యిందని, చాలా రోజులు ఆసుపత్రిలోనే ఉన్నారని ఆ మధ్య ప్రెస్ మీట్‌లో చెప్పారు. దీంతోపాటు సినిమా షూటింగ్ సెట్‌లోనూ ప్రమాదం జరిగిందని, ఆయన కాలుకి తీవ్ర గాయాలు అయినట్టు చెప్పారు. దీని కారణంగానూ కొన్నాళ్లపాటు సినిమా షూటింగ్ వాయిదా పడింది.
సినిమా మధ్యలోనే ఆగిపోయినప్పుడు నిర్మాత టీమ్‌కి హ్యాండిచ్చారట. షూటింగ్ డిలే అవుతున్న నేపథ్యంలో ఔట్ పుట్ చూసుకుని సినిమాని వదిలేద్దామనుకునే నిర్ణయానికి వచ్చారట. ఇంట్రెస్ట్ లు పెరిగిపోతుండటం, బడ్జెట్ మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ చాలా రిస్ట్ అవుతుందని భావించారు. డిలే కారణంగా, యాక్షన్ ఎపిసోడ్ల కారణంగా బడ్జెట్ భారీగా పెరగడంతో సినిమాను చేయనని ఒకానొక దశలో చేతులెత్తేశాడట. సినిమాని ఆపేసి యూఎస్ వెళ్లిపోవాలనుకున్నారని, హీరో అఖిల్, సురేందర్‌రెడ్డి బాధ్యత తీసుకుని సినిమాని కంటిన్యూ చేశారని తెలుస్తుంది. అందుకు తమ పారితోషికాలను త్యాగం చేశారట. అంటే అఖిల్, సురేందర్‌రెడ్డి సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. అందుకే పారితోషికం తీసుకోకుండా సినిమాని పూర్తి చేయించారని విశ్వసనీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. నిర్మాత కూడా అందరు మొత్తం రెమ్యూనరేషన్ తీసుకుంటే ఇది వందకోట్ల సినిమా అన్నారు.
అఖిల్ సైతం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. నిర్మాతలాగా ఓన్ చేసుకుని చేశాడట. నిర్మాతని ఒప్పించి ఈ సినిమాని పూర్తి చేయించారని టాక్. ఆ రకంగా సినిమా పూర్తయ్యిందని, లేదంటే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాపై అఖిల్, ఎంతో నమ్మకం పెట్టాడు. తన ప్రాణం పెట్టి చేశాడు. కానీ బలమైన కథ, కథనాలు లేకపోవడంతో సినిమాకి డివైడ్ టాక్ వస్తుంది. దాదాపు 36కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎంత వరకు రీచ్ అవుతుందా?, నెగటివ్ టాక్‌ని దాటుకుని నిలబడుతుందా? డిజాస్టర్ అవుతుందా? అనేది మున్ముందు తేలనుంది.
