Asianet News TeluguAsianet News Telugu

మొదట్లో బాగానే ఉండేవాళ్లం.. పెళ్లయ్యాక అభిప్రాయబేధాలు తలెత్తాయి!

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గతేడాది హాలీవుడ్ సింగర్, నటుడు నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

Priyanka Chopra on the criticism she receives over the age gap between her and Nick Jonas
Author
Hyderabad, First Published Jun 6, 2019, 1:45 PM IST

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గతేడాది హాలీవుడ్ సింగర్, నటుడు నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో కాపురం పెట్టారు. నిక్ కంటే ప్రియాంక పదేళ్లు పెద్దది కావడంతో సోషల్ మీడియాలో ఆమెని విపరీతంగా ట్రోల్ చేసేవారు.

ఇప్పటికీ ఆ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రియాంక.. నిక్ తో కలిసి తీసుకున్న ఏ ఫోటో పెట్టినా కొందరు నెటిజన్లు విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ విషయంలో మాట్లాడింది ప్రియాంక. తన భర్తకంటే తను పెద్దది కావడంతో కొందరు నీచంగా మాట్లాడుతున్నారని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.

భార్య కంటే భర్త పెద్దవాడైనప్పుడు లేని అభ్యంతరం అమ్మాయిల విషయానికొచ్చేసరికి విమర్శలతో సిద్ధమైపోతారని అసహనం వ్యక్తం చేసింది. తనను, నిక్ కు ఉన్న సంప్రదాయ వ్యత్యాసాల గురించి మాట్లాడుతూ.. ''మొదట్లో బాగానే ఉండేవాళ్లం కానీ పెళ్లైన తరువాత అభిప్రాయబేధాలు తలెత్తాయి. 

ఒక్కోసారి తను సర్దుకుపోతాడు.. మరోసారి నేను.. ఏం జరిగినా మన మంచికే అని చెబుతాడు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. తను నన్ను చాలా బాగా అర్ధం చేసుకుంటాడు'' అంటూ తన భర్త గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios