Asianet News TeluguAsianet News Telugu

పృధ్విరాజ్ ‌- విష్ణు ప్రియా మధ్యలో సమ్ థింగ్ సమ్ థింగ్.. సోనియాలో పెరిగిన భయం...

బిగ్ బాస్ హౌస్ రోజకో రకంగా మారుతోంది. వారం వారం బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ లకు  హౌస్ లో ఉన్నవారికే కాదు.. ఆడియస్స్ కు కూడా మతిపోతోంది. 

Pride and Tension: The Growing Connection Between Prithvi and Vishnu Priya on Bigg Boss Telugu 8 JMS
Author
First Published Sep 27, 2024, 11:20 PM IST | Last Updated Sep 27, 2024, 11:20 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఆట అదిరిపోతోంది.  గేమ్ రోజుకో రకంగా టర్న్ తీసుకుంటోంది. ఈక్రమంలో బిగ్ బాస్ హౌస్ లో కొన్నిచిత్ర విచిత్రాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రతీ సీజన్ లో మాదిరిగా ఈ సీజన్ లో కూడా ఓ ప్రేమ జంటను హైలెట్ చేస్తున్నాడు బిగ్ బాస్. 

ఇక ఈసీజన్ లో కూడా ఓ లవ్ స్టోరీ ఆడియన్స్ కు గిలిగింతలు పెట్టబోతోంది. బిగ్ బాస్ స్ట్రాట్ అయిన మూడు వారాల తరవాత పర్ఫెక్ట్ లవ్ స్టోరీ ఒకటి ఇంట్లో స్ట్రాట్ అయ్యింది. అది ఎవరిదో కాదు.. పృద్విరాజ్ , విష్ణు ప్రియలది. 

బిగ్ బాస్ రెండో వారం నుంచి  పృధ్వికి అట్రాక్ట్ అయ్యింది విష్ణు ప్రియా. అప్పటి నుంచి అతనిపై ఏదో ఒక రకంగా ప్రేమను చూపిస్తూనే ఉంది. అయితే అతను మాత్రం రెండు వారాలు అస్సలు ఆమెను పట్టించుకోలేదు. ఇక మూడో వారం నుంచి ఇద్దరు కాస్త క్లోజ్ అయ్యారు. 

ఇక నాలుగోవారంలో వీరిమధ్య రిలేషన్ ముదిరి పాకాన పడింది. విష్ణు ఎప్పుడు చూసినా..పృద్వి చుట్టు తిరగడం.. హౌస్ లో కూడా చర్చనీయాంశం అవుతోంది. దీనికి తోడు.. టాస్క్ లో భాగంగా లవ్ సాంగ్ పాడిన పృధ్వి.. అది విష్ణు ప్రియకు డెడికేట్ చేశాడు. దాంతో అతనికి పూర్తిగా పడిపోయింది ఈ స్టార్ యాంకర్. 

ఇక పృథ్వి విష్ణు ప్రియలు  కలిసి మెలిసి ఉండటం చూసి.. సోనియా కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. వాళ్ళిద్దరిని చూస్తుంటే భయమేస్తుంది అంటే ఆమె నిఖిల్ దగ్గర ఓపెన్ అయ్యింది. పృధ్విది  ఏం తప్పులేదు.. విష్ణునే చేస్తుంది అన్నట్టు గా మాట్లాడింది సోనియా. ఇక వీరి ప్రేమ గురించి అటు ప్రేరణ కూడా సీరియస్ కామెంట్స్ చేసింది. విష్ణు ప్రియ చాలా జన్యూన్ గా వెళ్తోంది.. కాని అతనే విష్ణుతో ఆడుకుంటున్నాడేమో అనిపిస్తుంది అంటూ ప్రేరణ కామెంట్ చేసింది. 

ఇక బిగ్ బాస్ హౌస్ లో బేరాలు స్టార్ట్ అయ్యాయి. రెండు టీమ్ ఉండగా.. శక్తీ టీమ్ నుంచి కాంతార టీమ్ కు.. కాంతార టీమ్ నుంచి శక్తి టీమ్ కు మారడానికి బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. దాంతో రెండు టీమ్ లకు సబంధించిన మెంబర్స్ బేరాలు స్టార్ట్ చేశారు. కాంతార టీమ్ పృధ్విని తమ వైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తుంటే.. నబిల్ ను తమ టీమ్ లోకి లాగాలని నిఖిల్ కు మణికంఠ సలహా ఇచ్చాడు. 

దాంతో గేమ్ ఇంకా రసవత్తరంగా మారిపోయింది. అంతే కాదు నిఖిల్ కు షాక్ ఇస్తూ.. మణికంఠ కాంతార టీమ్ లోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ టీమ్ నుంచి ఒకరిని స్వాప్ చేయాల్సి రాగా.. ఆదిత్యను అతను స్వాప్ చేశాడు. 

ఇక ఈ మధ్యలోనే బిగ్ బాస్  ఆడియన్స్ కోసం అదిరిపోయే ఫన్ ను ఏర్పాటు చేశాడు. అందులో భాగంగా.. బిగ్ బాస్ లో ఉన్న 11 మందికంటెస్టెంట్స్ ను క్యారెక్టర్స్ మార్చుకుని.. ఇమిటేట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇక అందరిలో నబిల్ ఆదిత్య ఓం పాత్రలో అద్భుతంగా చేశాడు. ఆతరువా నైనిక.. అచ్చం విష్ణు ప్రియ మాదిరిగా ఇమిటేట్ చేస్తూ మాట్లాడింది. 

ఇక ఈ ఈవెంట్ లో నబిల్ ను ఏకగ్రీవంగా విజేతను చేశారు. బెస్ట్ పెర్ఫార్మర్ గా నబిల్ ఎన్నికయ్యాడు. ఇక అంతకు ముందు జరిగిన సౌండ్ విని పేర్లు రాసే గేమ్ లో శక్తి టీమ్ విన్ అయ్యారు. దాంతో ఎక్కు రాషన్ తెచ్చుకోడానికి వారికి అవకాశం వచ్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios