Asianet News TeluguAsianet News Telugu

సాహో ప్రీమియర్ షో టాక్

యూవీ క్రియేషన్స్ లో ప్రభాస్ నటించిన 350కోట్ల సాహో సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా సినిమా ప్రీమియర్స్ ను అమెరికా -దుబాయ్-ఆంధ్రప్రదేశ్ లలో ప్రదర్శించగా సినిమాకు ఉహించనట్లే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మునుపెన్నడూ లేని భారీ యాక్షన్ సీన్స్ సినిమాలో ఉన్నట్లు సంతోషంగా చెబుతున్నారు. 

premier show of sahoo
Author
Hyderabad, First Published Aug 30, 2019, 4:39 AM IST

యూవీ క్రియేషన్స్ లో ప్రభాస్ నటించిన 350కోట్ల సాహో సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా సినిమా ప్రీమియర్స్ ను అమెరికాలో ప్రదర్శించగా సినిమాకు ఉహించనట్లే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మునుపెన్నడూ లేని భారీ యాక్షన్ సీన్స్ సినిమాలో ఉన్నట్లు ప్రవాసులు సంతోషంగా చెబుతున్నారు. 

సుజిత్ మేకింగ్ స్టైల్ కూడా చాలా బావుంది. ముఖ్యంగా ప్రభాస్ పాత్రను డిజైన్ చేసిన విధానం సరికొత్త కిక్ ఇస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అలాగే క్లయిమ్యాక్స్ లో ప్రభాస్ నుంచి వచ్చే డిఫరెంట్ షేడ్స్ ఆకట్టుకుంటుంది. శ్రద్దా కపూర్ ని ఈ సినిమా కోసం ఎందుకు తీసుకున్నారో అనే చాలా సందేహాలకు ఆమె తన నటనతోనే క్లారిటీ ఇస్తుందని చెప్పవచ్చు.బ్లాక్ బాక్స్ కి సంబంధించిన ట్విస్ట్ లు కూడా సినిమాలో హైలెట్ గా నిలిచాయని చెప్పవచ్చు. ప్రభాస్ - శ్రద్దా కపూర్ ల మధ్య కెమిస్ట్రీ తో పాటు యాక్షన్ మోడ్ కూడా కరెక్ట్ గా సెట్టయ్యింది. 

అదే విధంగా నీల్ నితిన్ తో పాటు చాలా మంది యాక్టర్స్ సినిమాలో చేసిన రోల్స్ దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి. సినిమాలో ప్రభాస్ కరేబియన్ విలన్స్ తో చేసే ఫైట్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంది. దుబాయ్ లో చేసిన హెవీ యాక్షన్ సీన్ హాలీవుడ్ సినిమాలను గుర్తు చేయక మానదు. నిజంగా అందులో ఉన్నదీ మన తెలుగు హిరోనేనా అనిపిస్తుంది. 

అయితే కథ పరంగా మాత్రం సినిమా అంత కొత్తగా ఏమి అనిపించకపోవచ్చు. కానీ స్క్రీన్ ప్లేతో సుజిత్ కొత్త ట్రై చేసిన మ్యాజిక్ సిల్వర్ స్క్రీన్ పై అదిరిందనే చెప్పాలి. మరి ప్రవాసులను ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా లోకల్ ఫ్యాన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios