Asianet News TeluguAsianet News Telugu

‘ప్రేమలు’ తెలుగు 15 రోజుల కలెక్షన్స్, తగ్గేదేలే.. ఎంత వసూళ్లు చేసిందంటే?

యూత్  ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ప్రేమలు మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తోంది.

Premalu Telugu version two weeks worldwide collections jsp
Author
First Published Mar 23, 2024, 7:17 AM IST

గత నెలలో మలయాళంలో రిలీజై సంచలన విజయం సాధించిన ప్రేమలు మూవీ మార్చి 8న తెలుగులోకీ వచ్చిన విషయం తెలిసిందే. రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేయగా.. రికార్డు కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ప్రారంభంలోౌ స్లో గా ఉన్నా కూడా మెల్లిగా పికప్ అయ్యి...వర్కింగ్ డేస్ లో మాత్రం సూపర్ స్టడీ కలెక్షన్స్ తో దూసుకు పోతూ బ్రేక్ ఈవెన్ ని తెలుగు లో కంప్లీట్ చేసుకుని లాభాలని కూడా సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం.

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

తెలుగు స్ట్రైయిట్ సినిమాలు పడుకున్న వేళ... ప్రేమలు అదరగొడుతుందంటే అందులో కంటెంటే కారణం అని చెప్పాలి . హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం  కేరళ నుండి సాఫ్ట్ వేర్ జాబ్ చేయడానికి హైదరాబాద్ కు వచ్చిన యువతి,యువకుల మధ్య సాగే ప్రేమ కథ ఇది. యూత్  ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ప్రేమలు మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తోంది.ముఖ్యంగా లవ్ , ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా కావటం కలిసొచ్చింది.  

  తెలుగు వెర్షన్ టు వీక్స్ (15 రోజులు)  కలెక్షన్స్ లెక్కలు చూస్తే..  రెండు తెలుగు రాష్ట్రాల నుంచి  10.5 కోట్లు దాకా వసూలు చేసింది. అలాగే  U.S లో తెలుగు వెర్షన్ ఒక్కటే  2.3 కోట్లు (గ్రాస్) తెచ్చుకుంది. రెస్టాఫ్ ఇండియా 1 కోటి దాకా వసూలు చేయగా ఓవరాల్ గా తెలుగు వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా 13.8 కోట్లు తెచ్చుకుంది. అలాగే ఈ రన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. 
   
టోటల్ గా  తెలుగువెర్షన్ సైతం బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అంటే రాజమౌళి కుమారుడు మొదటి వెంచర్ తో మంచి లాభాలు అందుకున్నాడు. ‘ప్రేమలు’ సినిమా ఒక మంచి లవ్ కామెడీ జోనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. హ్యాపీగా థియేటర్ కి వెళ్లి ఫుల్ గా నవ్వుకొని ఒక మంచి లవ్ స్టోరీ చూడాలనుకుంటే కచ్చితంగా ప్రేమలు సినిమాకి వెళ్లాల్సిందే.  ఈ సినిమాను ప్రముఖ నటుడు పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ నిర్మించగా గిరీష్ ఏడి డైరెక్ట్ చేశాడు.మమితా బైజు,నస్లేన్,అల్తాఫ్ సలీం,మీనాక్షి రవీంద్రన్,అఖిల భార్గవన్ లీడ్ రోల్స్ లో నటించారు.విష్ణు విజయ్ సంగీతం అందించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios