సాయికుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రస్థానం’. తెలుగులో  మంచి విజయం సాధించిన ఈ సినిమా చాలా గ్యాప్ తర్వాత  హిందీలో రీమేక్ అయ్యింది. డైరెక్టర్ దేవాకట్ట పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శర్వానంద్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచింది ప్రస్థానం. ఈ మూవీ గ్రామాల‌తో పాటు దేశంలో రాజ‌కీయాల‌ని డిఫ‌రెంట్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడు తెలుగు చిత్రం ప్ర‌స్థానంని హిందీలోను అదే పేరుతో దేవాక‌ట్ట‌నే తెరకెక్కించాడు.

ఈ చిత్రం ట్రైలర్ తో మంచి క్రేజే క్రియేట్ అయ్యింది.  తెలుగులో సాయి కుమార్ చేసిన పాత్రలో సంజయ్ దత్ నటించారు. వీరితో పాటు.. మనీషా కొయిరాలా, చంకీ పాండే, అమైరా దస్తుర్, అలీ ఫజల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దేవా కట్టానే హిందీలోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంజయ్ దత్ ప్రొడక్షన్స్, ఎన్‌హెచ్ స్టూడియోస్ బ్యానర్లపై మానయత దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిన్న శుక్రవారం (2019 సెప్టెంబర్ 20వ తేదీన )ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా టీజర్ కు వచ్చిన క్రేజ్ సినిమా రాలేదు. డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇది సంజయ్ అభిమానులను కాస్త నిరాశపరిచినా.. విజువల్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి  అన్నారు. ఇక సంజయ్ దత్ సైతం తన ఫెరఫార్మెన్స్ తో దుమ్ము రేపాడని అన్నారు. అయితే డైలాగులు మరీ ఓవర్ గా ఉన్నాయని అవే మేజర్ డ్రా బ్యాక్ అయ్యాయని విమర్శలు వచ్చాయి. అలాగే పాటలు సైతం రాంగ్ ప్లేస్ మెంట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. తెలుగులో  ఉన్నట్లుగా హిందీ వెర్షన్ లో సినిమా లేదని, చేసిన మార్పులు అతకలేదని చెప్తున్నారు. సినిమా సంజయ్ దత్ వీరాభిమానులకు తప్ప వేరే వారికి నచ్చటం లేదని ఫైనల్ టాక్.