రెబల్ స్టార్ కృష్ణంరాజు డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక్క అడుగు. ప్రభాస్ తో  హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించాలని ఆయన చాలా కాలంగా ఈ సినిమా గురించి కలలు కంటున్నారు. ప్రభాస్ సైతం ఈ సినిమాపై ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వరస ప్రాజెక్టుల బిజీతో ఆయనకు ఖాళీ ఉండటం లేదు. ఆ సినిమాకు ముందుకు వెళ్లటం లేదు.  దాంతో మూలన పడిపోయిందనుకున్న ఈ స్క్రిప్టు మళ్లీ ఈ మధ్యనే కృష్ణంరాజు గారు తన కొడుకు ప్రభాస్ తో చర్చించి ఏ డెసిషన్ చెప్పమన్నారట. ప్రభాస్ మీరు మిగతా పనులు మొదలెట్టండి చేసేద్దాం అన్నారట.

ఈ చిత్రం కథ స‌మాజాన్ని చైత‌న్య ప‌రిచే క‌థ అని…ఒక్క అడుగు వెయి అడుగులకు నాంది పల‌కాల‌న్న ఓ మంచి కానెప్ట్ తో రాసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఓకే అనటంతో  స‌రైన ద‌ర్శ‌కుడి కోసం అన్వేషణ మొదలెట్టారట. సొంత బ్యాన‌ర్లోనే ఆ చిత్రాన్ని నిర్మించాల‌ని చూస్తున్నారు. ఓ స్టార్ డైరెక్ట‌ర్ ని  ఈ సినిమా కోసం లాక్ చేసి పెట్టారుట‌.  ఇప్ప‌టికే బాగా ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో లేటు చేయ‌కూడ‌ద‌ని వీలైంత‌న త్వ‌ర‌గా సెట్స్ కు వెళ్లాల‌ని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

సాహో షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే చేద్దామ‌ని ప్ర‌భాస్ మొదలెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. సాహో షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది.  ఈ సినిమాతో పాటు పాటు జాన్ లోనూ న‌టిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది.  అయితే జాన్ షూటింగ్ తో   సంబంధం లేకుండా ఒక్క అడుగు ప్రారంభిస్తే నే బాగుంటుంద‌ని ఆలోచ‌న చేస్తున్నారుట‌. ఈ చిత్రంలో కూడా యూవీ క్రియేషన్స్ కలుస్తుందని సమాచారం.