Asianet News TeluguAsianet News Telugu

#Prabhas: ప్రభాస్ పరువు తీయటానికి కాకపోతే ఇవి అవసరమా?

. రీమాస్టర్ చేసిన ప్రింట్ మీద ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా లాభం లేకపోయింది. దీనికి కారణం లేకపోలేదు. గత నెల ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకుని రెబెల్, బిల్లాలు వరసగా స్పెషల్ షోలు వేశారు. 

Prabhas Varsham re-release became A disaster
Author
First Published Nov 13, 2022, 7:18 AM IST

ప్రభాస్ సరైన హిట్ కోసం చూస్తున్నాడు. ఇరవై నాలుగు గంటలూ కష్టపడుతున్నారు. కొత్త కథలు కోసం దర్శకులుతో మీటింగ్ లు, షూటింగ్ లు అని బిజీగా ఉన్నారు. వ్యక్తిగత జీవితం కన్నా ప్రొపిషనల్ కెరీర్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ముందుకు వెళ్తున్నాడు. అదే సమయంలో ఆయన ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ టైమ్ లో...వరసగా పాత సినిమాలు రీరిలీజ్ చేసి పరువు తీసే పోగ్రాం పెట్టుకుంటున్నారు.

సినిమాలు రీరిలీజ్ చేయటం ఫ్యాన్స్ ఈ మధ్యన మొదలెట్టారు. మొదట్లో ఓల్డ్ బ్లాక్ బస్టర్స్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పోకిరి, జల్సా, భిళ్లా వంటి సినిమాలు అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుడు ఎంజాయ్ చేసాడు. కానీ అవకాసం దొరికింది కదా అదే ట్రెండ్ ని కంటిన్యూ చేసి, డబ్బులు లాగుదామనుకుంటే మాత్రం దెబ్బే అని మాత్రం అర్దం చేసుకోలేకపోయారు. ప్రభాస్ ఇరవై సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న నేఫధ్యంలో వర్షం సినిమాని రీరిలీజ్ చేసారు. శోభన్ తెరకెక్కించిన ఈ మూవీని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. 

 ఈ మూవీని అనేక థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తే కేవలం హైదరాబాద్ లోని కుకుట్ పల్లి, హైదరాబాద్ క్రాస్ రోడ్స్, వంటి చోట్ల హౌస్ ఫుల్స్ పడటం తప్పించి మిగతా చోట్ల రెస్పాన్స్ లేదని ట్రేడ్ టాక్.  కొన్ని డిస్ట్రిక్ట్ సెంటర్లలో షోలు క్యాన్సిల్ చేసారని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల చాలా తక్కువ మంది జనం ఉన్నారు. అక్కడ నుంచి సోషల్ మీడియాలో ..మీ సినిమాకు జనం లేరంటా యాంటి ఫ్యాన్స్ కామెంట్స్ రచ్చ. ఇదంతా అవసరమా అనిపిస్తోంది అభిమానులకు. 

దీంతో రెండు మూడు రోజులు రన్ చేయాలనుకున్న బయ్యర్లకు షాక్ తగిలింది. రెండు దశాబ్దాల మైలురాయి కాబట్టి అభిమానులు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారనే అంచనాలు మొత్తంగా తప్పయ్యాయి. రీమాస్టర్ చేసిన ప్రింట్ మీద ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా లాభం లేకపోయింది. దీనికి కారణం లేకపోలేదు. గత నెల ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకుని రెబెల్, బిల్లాలు వరసగా స్పెషల్ షోలు వేశారు. ఒకప్పటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం అనేక థియేటర్స్ లో రీ రిలీజ్ అయ్యింది. 

 అయితే ఇలా రీరిలీజ్ లకు జనం రాకపోవటంలో  వింతేమీ లేదు. అక్కడ ప్రభాస్ సినిమా అయినా మరో హీరో సినిమా అయినా ఒకటే. యూట్యూబ్ లో ,ఓటిటి లలో సినిమా దొరుకుతూంటే పనిగట్టుకుని సినిమాకు పరుగెట్టేదెవరు. ఏదో స్పెషల్ అకేషన్ అంటే ఫ్యాన్స్ పోగవుతారు కానీ డబ్బులు చేసుకుందమని నట్టికుమార్ చేసిన ఈ ప్రయత్నం  బయ్యర్లకు షాక్ కొట్టింది.  రీమాస్టర్ చేసిన ప్రింట్  ఎంత బాగున్నా ఫలితం లేకపోయింది.  గత నెల ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకుని రెబెల్, బిల్లాలు వరసగా స్పెషల్ షోలు వేస్తే  సూపర్ గా రెస్పాన్స్ వచ్చిందని ఈ ప్రయత్నం చేసారు. బంగారు గుడ్లు పెట్టే బాతుని అత్యాశతో కోసుకుతిన్నట్లే జరుగుతోంది ఈ రీరిలీజ్ లు వ్యవహారం అని అంతటా వినపడుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios