తన పెదనాన్న కృష్ణంరాజు తీరుతో నటుడు ప్రభాస్ విసిగిపోయినట్లుసమాచారం. దానికి కారణం కృష్ణంరాజు తరచూ మీడియా ముందు ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడడమే అని తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్న ప్రతిసారి కృష్ణంరాజు మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇస్తున్నాడు.

ఇప్పటికే చాలా సార్లు ప్రభాస్ పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు కృష్ణంరాజు. రీసెంట్ గా కూడా 'సాహో' సినిమా పూర్తయిన తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అన్నారు. ఈ విషయాలు ప్రభాస్ కి నచ్చడం లేదట.

తన సినిమాలకు సంబంధించి వార్తల్లో ఉండాలే కానీ ఇలా వ్యక్తిగత విషయాలతో కాదని ప్రభాస్.. కృష్ణంరాజుకి చెప్పినట్లు సమాచారం. ఇకపై మీడియాలో తన పెళ్లి గురించి ఎలాంటి  కామెంట్స్ చేయకూడదని చెప్పాడట.

ప్రభాస్ తీరు చూస్తుంటే ఇప్పట్లో ఆయనకు పెళ్లి ఆలోచన ఉన్నట్లు కనిపించడం లేదు. 'సాహో' సినిమాతో పాటు దర్శకుడు రాధాకృష్ణ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాడు. 'సాహో' సినిమాను ఈ ఏడాది ఆగస్ట్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.