Asianet News TeluguAsianet News Telugu

సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్న ప్రభాస్.. సమంతను ఫాలో అవుతున్నాడా..?

గ్లోబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారా..? ప్రభాస్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నిజమేనా..? సమంత మాదిరిగా లాంగ్ బ్రేక్ తీసుకోవాలి అనుకోవడంలో నిజం ఎంత..? 

Prabhas take a break From Movies for His Health Problems  JMS
Author
First Published Jan 31, 2024, 12:28 PM IST | Last Updated Jan 31, 2024, 12:49 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ప్లాప్ లు ఫేస్ చేశాడు. తాజాగా ప్రభాస్ కు ఊరటనిస్తూ.. సలార్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈసినిమా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ను సాధిస్తోంది. ఇక ఈక్రమంలో ప్రభాస్ చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో కల్కీ సినిమా షూటింగ్ ను రీసెంట్ గా కంప్లీట్ చేశాడు ప్రభాస్. ఇక మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ ను పట్టాలెక్కించాల్సి ఉంది. అటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ కు ఇంకా టైమ్ ఉంది. వీటితో పాటు సలార్ 2 కూడా పట్టాలెక్కించాల్సి ఉంది.  అయితే ఈలోపు ప్రభాస్ సినిమాలకు బ్రేక్ ఇస్తాడన్న టాక్ వినిపిస్తోంది. 

సలార్ తో హిట్ కొట్టిన ప్రభాస్.. కల్కీ షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక మారుతి రాజాసాబ్ ను సమ్మర్ లో కాని ఆతరువాత కాని స్టార్ట్ చేయాలి అని చూస్తున్నాడు. ఈక్రమంలో ప్రభాస్ ఈ గ్యాప్ లో రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాడట. ఇప్పటికే ప్రభాస్ హెల్త్ పై చాలా వదంతులు వచ్చాయి. ఆయన ఫిట్ నెస్ లో కాని.. ఫేస్ లో కాని చాలాచేంజెస్ వచ్చాయి. పైగా రీసెంట్ గా మోకాలికి సర్జరీ కూడా చేయించుకుని వచ్చారు ప్రభాస్. దాంతో ప్రభాస్ ప్రస్తుతం అన్నీ  పక్కన పెట్టి.. రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నాడట. దాని కోసం విదేశాలకు వెళ్ళాలా  లేక లోకల్ గా ఉండి రెస్ట్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాడట. 

Prabhas take a break From Movies for His Health Problems  JMS

అంతే కాదు ఫిట్ నెస్ కూడా పెంచుకుని.. కాస్త రూపం మార్చుకోవాలి  అని ప్లాన్ చేస్తున్నాడట ప్రభాస్. ఈ విషయంలో ప్రభాస్ సమంతను ఫాలో అవ్వబోతున్నాడు అని అంటున్నారు నెటిజన్లు. సమంత మాదిరిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. కొన్ని రోజులు బాడీ చెకప్ తో పాటు.. కొన్నిచిన్న చిన్న ప్రాబ్లమ్స్ కు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాడని టాక్. మరి ఈ విషయంలో నిజం ఎంత  ఉందో తెలియదు కాని.. ఈవార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఏడాది ఎలాగైనా రాజాసాబ్ షూటింగ్ తో పాటు.. సలార్ పార్ట్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ చేసి కంప్లీట్  చేయాలి అనేది ప్రభాస్ టార్గెట్ గా తెలుస్తోంది. 

ఆతరువాత వచ్చే ఏడాది వరకూ సందీప్ వంగ సినిమాపై దృష్టి పెట్టే యోచనలో ఉన్నాడట ప్రభాస్. లేదంటే ఈ ఏడాది ఎండింగ్ లో సందీప్ వంగా సినిమా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. మరి ముందు ముందు ఏం జరుగుతుంది. ప్రభాస్ మనసులో ఏం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సలార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ప్రభాస్. నెక్ట్స్ ప్లానింగ్స్ పై చర్చలు జరుపుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios