Asianet News TeluguAsianet News Telugu

ఇటలీలో ప్రభాస్.. సైలెంట్ గా యాక్షన్ రంగంలోకి దిగిన యంగ్ రెబల్ స్టార్

భారీ యాక్షన్ సీన్స్ కోసం రంగంలోకి దిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  పారెన్ షెడ్యూల్ కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్.. సైలెంట్ గా రంగంలోకి దూకబోతున్నాడు. 
 

Prabhas Salaar action Scene Shooting In Italy
Author
First Published Mar 17, 2023, 12:37 PM IST

ప్రభాస్  యాక్షప్ సీన్స్ అంటే ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. ఆయన్ను యాక్షన్ హీరోగా చూడటానికి ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరుతుంటారు. ఇక ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే ఈ ఏడు యాక్షన్ మూవీతో రాబోతున్నాడు ప్రభాస్. రెబల్ స్టార్  హీరోగా రూపొందుతున్న సలార్ సినిమా షూటింగ్ స్పీడ్ పెంచారు టీమ్.  ఈసినిమా లేట్ అయ్యేకొద్ది  అంతకంతకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. కన్నడ యంగ్ డైరెక్టర్.. కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, హోంబలే బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 

ఇక ఈమూవీ యాక్షన్ సీన్స్ కోసం తెగ కష్టపడుతున్నారు టీమ్.  ప్రశాంత్ నీల్ ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ఇటలీలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ ప్రభాస్ .. విలన్ గ్యాంగ్ మధ్య వచ్చే వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమా మొత్తానికి  హైలైట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది. 

ఇప్పటికే సలార్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు 85 శాతం వరకూ పూర్తవుతుందని అంటున్నారు.  మిగిలిన  భాగాన్ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారని అంటున్నారు. ప్రభాస్ ను డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. షూటింగ్ ను నెక్ట్స్ మన్త్ వరకూ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్ళబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ లో కొన్ని పనులు స్టార్ట్ చేశారని తెలుస్తోంది. 

ఇక  జగపతిబాబు - పృథ్వీ రాజ్ సుకుమారన్ పవర్ఫుల్ పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో.. ప్రభాస్ జోడీగా శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను, ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈసినిమాకు కెజియఫ్ ఫేమ్ రవి బస్రూర్ సమకూర్చిన సంగీతం హైలెట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నట్టు సమాచారం.  
 

Follow Us:
Download App:
  • android
  • ios