Asianet News TeluguAsianet News Telugu

`సాహో` ట్రైల‌ర్ డేట్ ఇదే?

ఇండియా మోస్ట్ అవైటెడ్ 2019 మూవీ `సాహో`. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం  టీజర్ ఇప్పటికే రిలీజై ఇంటర్నెట్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. 

Prabhas's Saaho movie Trailer date fix
Author
Hyderabad, First Published Jun 14, 2019, 6:08 PM IST

ఇండియా మోస్ట్ అవైటెడ్ 2019 మూవీ `సాహో`. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం  టీజర్ ఇప్పటికే రిలీజై ఇంటర్నెట్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం 6 గంట‌ల్లోనే 25మిలియ‌న్ల మంది చూడటం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడ చూసినా టీజ‌ర్ ట్రీట్ అదిరింద‌న్న టాక్ వినిపిస్తోంది. దాంతో అభిమానులు దృష్టి అంతా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమా ట్రైల‌ర్ పై పడింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చర్చలు చేస్తున్నారు.

భారీ యాక్షన్ సీన్స్, బెస్ట్ క్వాలిటీ విజువల్స్ కలిగి టీజరే ఇలా అంటే ట్రైలర్ ఇంకెలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ట్రైలర్ జూలై 1న విడుదలవుతుందని తెలుస్తోంది.  

ఇదిలా ట్రైల‌ర్ ని నార్త్ ఇండియాతో  స‌హా వరల్డ్ వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ కు చేరువ చేయాలని దర్శక,నిర్మాతల ఆలోచన. అందుకోసం స్పైడ‌ర్ మేన్ సిరీస్ నుంచి వ‌స్తున్న తాజా సినిమా `స్పైడ‌ర్ మేన్ – ఫార్ ఫ్రం హోం` చిత్రాన్ని వేదికగా చేసుకోనున్నారు. స్పైడర్ మేన్ చిత్రాన్ని దేశ‌వ్యాప్తంగా 2000 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. జూలై 5 న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. దాంతో పాటే సాహో థిర‌యేట్రిక‌ల్ ట్రైల‌ర్ ని రిలీజ్ చేస్తే మైలేజ్ బావుంటుంద‌ని యువి- టీసిరీస్ సంస్థ‌లు భావిస్తున్నాయ‌ట‌.  అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.  

Follow Us:
Download App:
  • android
  • ios