2019 మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాలో ఓ రేంజి  క్రేజుతో వెలిగిపోతున్న చిత్రం `సాహో`. బాహుబలి తర్వాత  ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాగా `సాహో` చిత్రం గురించే అందరూ మాట్లాడుతున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ రాకకోసం  ఫ్యాన్స్   కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 

టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్- కోలీవుడ్- మాలీవుడ్- శాండల్వుడ్ లోనూ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అంచనాలకు తగినట్లే యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతవరకూ బాగానే ఉంది. కానీ రిలీజ్ కు దగ్గరపడుతున్న సమయంలో సంగీత దర్శక త్రయం తప్పుకోవటం జరిగింది. ఇది సినిమా బిజినెస్ వైజ్ గా దెబ్బ కొడుతోందని ట్రేడ్ టాక్.

అందుతున్న సమాచారం ప్రకారం...ఈ చిత్రం హిందీ వెర్షన్ కు ఈ మ్యూజిక్ డైరక్టర్స్ బయిటకు వెళ్లటం అనేది బిజినెస్ పరంగా పెద్ద దెబ్బ . కేవలం ప్రభాస్ ని చూసే అక్కడ సినిమాని కొనాలి. దర్శకుడు సుజీత్ కు రాజమౌళిలా అంతకు ముందు హిట్స్ ఇచ్చిన పేరు లేదు. బాలీవుడ్ లో ఆ పేరు ఎవరికీ తెలియదు. ఆ లోటు కవర్ చేయటానికే బాలీవుడ్ హీరోయిన్ ని, సంగీత దర్శకులను మొదట తీసుకొచ్చారు. 

అయితే సంగీత త్రయం తప్పుకోవటంతో  అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాపై ఉత్సాహం కోల్పోతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవి నిర్మాతలను కంగారుపెడుతున్నాయిట.  ఎందుకంటే హిందీలోనూ భారీగా బిజినెస్ చేస్తున్నారు. తమన్ లేదా గిబ్రన్ పేరుని సంగీత దర్శకుడుగా ప్రకటిస్తే ఏ మేరకు ఆ లాస్ ని రికవరీ చేయవచ్చు అనే ఆలోచనలో ఉన్నారట.  

దాంతో మరో బాలీవుడ్ సంగత దర్శకుడుని సీన్ లోకి తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచన సైతం చేస్తున్నారట.  అయితే తమన్ రీసెంట్ గా రోహిత్ శెట్టి సింబా(టెంపర్ రీమేక్) చిత్రానికి మ్యూజిక్ ఇచ్చారు.  దాంతో తీసుకుంటే ప్రీతమ్ లేదా తమన్ ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఎవరు పాటలు ఇచ్చినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ ఇస్తారట.