Asianet News TeluguAsianet News Telugu

'ఫలక్ నుమా ప్యాలెస్' ని ప్రభాస్ కోసం ఎలా మార్చారంటే...

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివర దశలో ఉంది. కొద్ది రోజులుగా హైదరాబాద్ లోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా చిన్న గ్యాప్ తీసుకున్న చిత్రయూనిట్ మళ్ళీ షూటింగ్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే  ఫలక్ నుమా ప్యాలెస్ లో ఏ సీన్స్ తీస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. 

Prabhas Radhe Shyam Shooting In Falaknuma Palace jsp
Author
Hyderabad, First Published Jan 8, 2021, 9:48 AM IST

‘బాహుబలి’ తో ప్యాన్‌ ఇండియా స్టార్‌ రేంజ్ కు ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం లో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్‌లుక్‌, ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ భారీగానే పెరిగాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివర దశలో ఉంది. కొద్ది రోజులుగా హైదరాబాద్ లోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా చిన్న గ్యాప్ తీసుకున్న చిత్రయూనిట్ మళ్ళీ షూటింగ్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే  ఫలక్ నుమా ప్యాలెస్ లో ఏ సీన్స్ తీస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. 

అందుతున్న సమాచారం ప్రకారం మేకర్స్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ ని ఇటలీలోని కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూట్ ప్లాన్ చేసారు. అయితే కరోనా ప్రభావంతో కుదరటంలేదు. దాంతో ఇక్కడే ఫలక్ నుమా ప్యాలెస్ లో కొన్ని మార్పులు చేసి ఇటలీ ఎట్మాస్మియర్ తీసుకొచ్చి షూట్ ఫినిష్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం కథ..ఇటలీలో జరిగే లవ్ స్టోరీ. 

మరో ప్రక్క టీజర్‌ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ రీసెంట్ గా ఒక ఓ ప్రామిస్‌ చేసారు. త్వరలోనే ఈ సినిమా టీజర్ అప్ డేట్ ఇస్తానని చెప్పాడు.  అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి  సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస  ఎడిటర్ :  కొటగిరి వెంక‌టేశ్వ‌రావు యాక్ష‌న్‌, స్టంట్స్‌ : నిక్ ప‌వ‌ల్, సౌండ్ డిజైన్ : ర‌సూల్ పూకుట్టి కొరియోగ్ర‌ఫి : వైభ‌వి మ‌ర్చంట్‌ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని వి ఎఫ్ ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ : క‌మ‌ల్ క‌న్న‌న్‌  ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : ఎన్‌.సందీప్‌, హెయిర్‌స్టైల్‌‌ : రోహ‌న్ జ‌గ్ట‌ప్‌  మేక‌ప్‌ : త‌ర‌న్నుమ్ ఖాన్  స్టిల్స్‌ : సుద‌ర్శ‌న్ బాలాజి  ప‌బ్లిసిటి డిజైన‌ర్‌ : క‌బిలాన్‌ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను  కాస్టింగ్ డైర‌క్ట‌ర్‌ : ఆడోర్ ముఖ‌ర్జి  ప్రోడక్షన్ డిజైనర్ : ర‌‌వీంద‌ర్‌  చిత్ర స‌మ‌ర్ప‌కులు : "రెబ‌ల్‌స్టార్" డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు   నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌శీదా  దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios