Asianet News TeluguAsianet News Telugu

ఆ డేట్ కే ‘రాధేశ్యామ్‌’ రిలీజ్ లాక్?


పెద్ద సినిమాలు అన్ని వరస పెట్టి రిలీజ్ డేట్స్ ప్రకటన చేసేసాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, ‘పుష్ప’ లాంటి భారీ చిత్రాలకూ రిలీజ్ డేట్ ఖరారైంది.  నెక్ట్స్ ఇయిర్ సంక్రాంతికి వస్తున్న ‘సర్కారు వారి పాట’ సైతం రిలీజ్ డేట్ ప్రకటన చేసేసింది.  కానీ ఒక్క ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ రిలీజ్ విషయం మాత్రం తేలటం లేదు. ఈ  విషయంలోనే సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవ కానుకగా ‘రాధేశ్యామ్’ టీజర్ రిలీజ్ చేస్తున్న చిత్ర టీమ్.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాసం ఉందని మీడియా అంటోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. 

Prabhas Radhe Shyam Release Date Locked? jsp
Author
Hyderabad, First Published Feb 8, 2021, 7:35 AM IST

ప్రభాస్ లాస్ట్ పిల్మ్ ‘సాహో’ సినిమా అంతగా వర్కవుట్ కాకపోవటంతో అభిమానుల చూపంతా ‘రాధేశ్యామ్’ పైనే ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘జిల్’ సినిమా తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 

ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుగుతోంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. దాంతో మిగతా భాషల్లో రిలీజ్ అయ్యే సినిమాల రిలీజ్ లు చూసుకుని ఈ డేట్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జూలై 30న ‘రాధేశ్యామ్’ విడుదలవుతుందని తెలుస్తోంది. 
 
ఇదిలా ఉంటే ఈ చిత్రం బిజినెస్ ఇప్పటికే ఊపందుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ‘రాధేశ్యామ్‌’ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని ప్రీమియర్ డిస్ట్రిబ్యూటర్ గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు సొంతం చేసుకున్నారు. వారు 22 కోట్లకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్న వార్త. ఈ కరోనా టైమ్ లో ఇది అది పెద్ద విషయం. ఇప్పటి వరకు కేవలం ఓవర్ సీస్ సినిమా పంపిణీలోనే అడ్వాన్స్ లేకుండా ఫుల్ పేమెంట్ తో సినిమా బిజినెస్ జరుగుతుంది.  ఈ సినిమాకు అలాగే జరిగిందని తెలుస్తోంది. 


నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస  ఎడిటర్ :  కొటగిరి వెంక‌టేశ్వ‌రావు యాక్ష‌న్‌, స్టంట్స్‌ : నిక్ ప‌వ‌ల్, సౌండ్ డిజైన్ : ర‌సూల్ పూకుట్టి కొరియోగ్ర‌ఫి : వైభ‌వి మ‌ర్చంట్‌ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని వి ఎఫ్ ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ : క‌మ‌ల్ క‌న్న‌న్‌  ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : ఎన్‌.సందీప్‌, హెయిర్‌స్టైల్‌‌ : రోహ‌న్ జ‌గ్ట‌ప్‌  మేక‌ప్‌ : త‌ర‌న్నుమ్ ఖాన్  స్టిల్స్‌ : సుద‌ర్శ‌న్ బాలాజి  ప‌బ్లిసిటి డిజైన‌ర్‌ : క‌బిలాన్‌ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను  కాస్టింగ్ డైర‌క్ట‌ర్‌ : ఆడోర్ ముఖ‌ర్జి  ప్రోడక్షన్ డిజైనర్ : ర‌‌వీంద‌ర్‌  చిత్ర స‌మ‌ర్ప‌కులు : "రెబ‌ల్‌స్టార్" డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు   నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌శీదా  దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.

Follow Us:
Download App:
  • android
  • ios