Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ఆధ్యాత్మిక యాత్ర.. సలార్ ఎఫెక్ట్.. మొక్కులు తీర్చుకుంటున్న యంగ్ రెబల్ స్టార్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై సలార్ ఎఫెక్ట్ గట్టిగా కనిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరో ఆధ్యాత్మిక యాత్రల్లో బిజీగా ఉన్నాడు. ఇంతకీ ఎక్కడెక్కడికి వెళ్ళాడంటే..? 
 

Prabhas Prashanth Neel and Salaar Team  Visited Sri Durga Parameshwari Temple Mangalore JMS
Author
First Published Jan 13, 2024, 8:45 AM IST

రీసెంట్ గా సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాక్సాఫీస్ దగ్గర సలార్ మ్యానిగా గట్టిగా నడిచింది. ఈమూవీ దాదాపుగా 700 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ డంకీ , కన్నడాలో హీరో దర్శన్ కు సబంధించిన మరో సినిమా సలార్ కలెక్షన్స్ పై ప్రబావం చూపించడంతో వెయ్యి కోట్ల మార్క్ ను మిస్ అయ్యింది సలార్. ఏదైమైనా..బాహుబలి తరువాత ప్రభాస్ ఆ రేంజ్ లో హిట్ కొట్టాడు.  దీంతో ప్రభాస్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. 

ఇక నెక్ట్స్ మూవీస్ కూడా ఇలానే పడితే.. హ్యాట్రీక్ ఫెయిల్యూర్ ప్రభావం నుంచి బయట పడి.. ప్రభాస్ కాస్త కొలుకునే అవకాశం ఉంది. అయితే యంగ్ రెబల్ స్టార్ పై సలార్ ప్రభావం గట్టిగా కనిపిస్తుంది. ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. మూవీ హిట్ అయినందుకు సంతోషంలో ఉన్నాడు అంతే కాదు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నాడు.. దైవ దర్శనాలు చేసుకుంటూ..మొక్కులు చెల్లించుకుంటున్నాడు. అసలే  ప్రభాస్ బయటకు పెద్దగా రాడు..  చాలా తక్కువగా కనిపిస్తాడని అందరికి తెలుసు. సలార్ ప్రమోషన్లు కూడా చేసింది లేదు. చేసినా.. ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే మూవీ హిట్ అయిన తరువాత మాతరం చాలా హుషారుగా వచ్చి.. సలార్ సక్సెస్ మీట్ లో పాల్గోన్నాడు. మూవీ టీమ్ ఈ సక్సెస్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ప్రభాస్ ఈ ఈవెంట్ లో సెంట్రల్ అట్రాక్షన్ గా నిలిచాడు. 
తాజాగా ప్రభాస్ గుళ్లు గోపురాలు తిరుగుతూ.. సందడి చేస్తున్నాడు. . సలార్ నిర్మాతలు హోంబేలె సంస్థ కర్ణాటక సంస్థ తో కలిసి ఈసినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటూ.. మొక్కులు కూడా తీర్చుకుంటున్నాడు. నిర్మాత, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్, మరికొంతమంది కలిసి  మంగళూరు దగ్గర్లో కాటెల్ గ్రామంలో ఉన్న ఉన్న శ్రీ దుర్గ పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ అధికారులు, పూజారులు అమ్మవారి పటం, ప్రసాదం ప్రభాస్ కి అందచేసి ఆశీర్వదించారు.

దీంతో ప్రభాస్ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ కళ్ళజోడు పెట్టుకొని, తలపై క్యాప్ పెట్టుకొని, మాస్క్ తో వైట్ హుడి, బ్లాక్ ప్యాంట్ వేసుకొని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు ప్రభాస్. ఇక ఆయన ఫ్యాన్స్ ఈ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కల్కీ సినిమాతో పాటు.. మారుతి మూవీలో బిజీగా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్. అటు సందీప్ తో స్పిరిట్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios