Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ కనగరాజ్ కథ విన్న ప్రభాస్..? సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ రెబల్  స్టార్  ప్రభాస్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకున్నాడో ఏమో... గ్యాప్ లేకుండా సినిమాలు కమిట్ అవుతున్నారు. ఇందులో భాగంగా..తమిల యంగ్ డైరెక్టర్  చెప్పిన కథపై హోమ్ వర్క్ చేస్తున్నాడట ప్రభాస్. 
 

Prabhas Movie with Tamil Director Lokesh Kanagaraj
Author
First Published Nov 27, 2022, 2:38 PM IST

త్వరలో పాన్ ఇండియా రేంజ్ లో మరో  డిఫరెంట్ కాంబినేషన్ ను చూడబోతున్నారు ఆడియన్స్. ఎవ్వరూ ఊహించని విధంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తమిళ యంగ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.  వరుసగా సూపర్ సక్సెస్ లు  సాధించిన లోకేష్ కనకరాజ్ కు అంతే వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమా ఆఫర్లొస్తున్నాయి. ఇండస్ట్రీకొచ్చి 5 ఏళ్లు అయ్యిందో లేదో సౌత్ స్టార్ హీరోలందరూ ఈ డైరెక్టరే కావాలంటున్నారు. 

కాన్సెప్ట్ మూవీస్ తో పాటు కమర్షియల్  ఎలిమెంట్స్ ను జోడించి స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ అందిస్తన్నాడు లోకేష్ కనగరాజ్. ఇక ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్. తమిళ్ లో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు కొడుతున్న ఈ యంగ్ డైరెక్టర్ త్వరలో విజయ్ తో సినిమా చేయనున్నాడు. అది కాకుండా ఖైదీ 2, విక్రమ్ 2 కూడా ఈ డైరెక్టర్ చేతిలో ఉన్నాయి. అటు తమిళ్ లో బిజీగా ఉంటూనే తెలుగులో కూడా సినిమాల మీద ఫోకస్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా విక్రమ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన లోకేష్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడంటూ టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే ప్రభాస్  కు  తన కథ లైన్ ను చెప్పేశాడట లోకేష్. అయితే ఈ లైన్ నచ్చడంతో ప్రభాస్ కాస్త హోమ్ వర్క్  చేయడానికి టైమ్ తీసుకుని.. పెండింగ్ లో పెట్టాడట. అయితే  ప్రభాస్ ఇప్పటికే భారీ లైనప్ తో ఉన్నాడు. ఉన్న సినిమాలే ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియదు. కానీ ఇంకా కొత్త కథలు వింటున్నాడు. అటు లోకేష్ కు  ఉన్న కమిట్ మెంట్స్ పూర్తి అయ్యే సరికి కూడా అదే టైమ్ పడుతుంది. దాంతో ఈలోపు అంతా సెట్ చేయవచ్చు అని అనుకుంటున్నాడట ప్రభాస్.

అంతే కాదు  యువీ క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో ప్రభాస్ తో స్టైల్ యాక్షన్ మూవీని లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. గతంలో మాస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన లోకేష్ తెలుగు హీరోలతో సినిమా చెయ్యడానికి ట్రై చేస్తున్నా అని హింట్ ఇచ్చారు. రామ్ చరణ్ కి స్టోరీ చెప్పానని, ఆయన ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నానని కూడా చెప్పాడు లోకేష్. త్వరలో రామ్ చరణ్ తో సినిమా  స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆతరువాత ప్రభాస్ సినిమా లైన్ లోకి వస్తుందంటున్నారు. అయితే ఇప్పటికే చాలా సినిమాలు ఇలాస్టార్ట్ అయ్యి కనిపించకుండా పోయాయి. మరి లోకేష్ - ప్రభాస్ కాంబోలో సినమా వర్కౌట్ అవుతందా లేదా చూడాలి మరి. 

Follow Us:
Download App:
  • android
  • ios