ప్రభాస్ .. మారుతి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే...
ప్రభాస్ తో ఒక షెడ్యూల్ ను .. ప్రభాస్ లేకుండగా మరో షెడ్యూల్ షూటింగును జరిపినట్టుగా సమాచారం. ఈ రెండు షెడ్యూల్స్ కి సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రభాస్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సూపర్ నాచురల్ హారర్ కామెడీ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోన్న ఈ చిత్రం గురించిన ఫొటోలు కానీ మరొకటి కానీ బయిటకు రాకుండా అన్ని జాగ్రత్లు తీసుకుంటున్నారు. సైలెంట్ గా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో డిసెంబర్ 8 నుంచి ప్రారంభించి పూర్తి చేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను దర్శకుడు మారుతి చిత్రీకరించినట్లు తెలిసింది. ఇక మూడో షెడ్యూల్ షూటింగును ఈ నెల 27వ తేదీ నుంచి మొదలెట్టనున్నారని అంటున్నారు. పదిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్‌ను కొనసాగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ తో ఒక షెడ్యూల్ ను .. ప్రభాస్ లేకుండగా మరో షెడ్యూల్ షూటింగును జరిపినట్టుగా సమాచారం. ఈ రెండు షెడ్యూల్స్ కి సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ షెడ్యూల్ తో దాదాపు ఈ సినిమా షూటింగు ఆల్రెడీ పూర్తైపోతుందని తెలుస్తోంది. ప్రభాస్ సినిమా కోసం భారీ వ్యయంతో ఓ పాతకాలం నాటి థియేటర్ సెట్‌ను చిత్ర యూనిట్ వేసినట్లు వినికిడి.
ఈ మూడో షెడ్యూల్ షూటింగులో ప్రభాస్ తో పాటు మాళవిక మోహనన్ కూడా పాల్గొననుందని చెబుతున్నారు. ఈ షెడ్యూల్ లో ఒక యాక్షన్ సీన్ కూడా ప్లాన్ చేశారట. మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ హారర్ కామెడీ సినిమాను, ఈ ఏడాది దసరా పండుగకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే అక్టోబర్ 24, 2023 న రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలిసింది. ప్రభాస్, మారుతి సినిమాకు రాజా డీలక్స్ అనే పేరును పరీశీలనలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర యూనిట్ మాత్రం టైటిల్‌తో పాటు షూటింగ్, క్యాస్టింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. లిమిటెడ్ బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 'సలార్' .. 'ప్రాజెక్టు K' .. 'స్పిరిట్' సినిమాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆయన ఒకదాని తరువాత ఒకటిగా పూర్తిచేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మారుతి దర్శకత్వంలో చేయనున్న 'రాజా డీలక్స్' సినిమా ఎప్పుడు పూర్తై, రిలీజ్ అవుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.