Asianet News TeluguAsianet News Telugu

సాహోకి ప్రభాస్ డబ్బింగ్ చెప్పడా.. అభిమానుల కోసం కష్టాలు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సాహో. యువ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి మరో చిత్రం రాకపోవడంతో ఫ్యాన్స్ అంతా సాహో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Prabhas in dilemma over Saaho Hindi version Dubbing
Author
Hyderabad, First Published May 14, 2019, 10:08 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సాహో. యువ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి మరో చిత్రం రాకపోవడంతో ఫ్యాన్స్ అంతా సాహో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. దీనితో నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని కూడా సాహో చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. 

తాజాగా సాహో హిందీ వర్షన్ కు సంబంధించిన ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. నార్త్ ఆడియన్స్ కూడా సాహో చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాహుబలి హిందీ వర్షన్ కు ప్రభాస్ డబ్బింగ్ చెప్పలేదు. కానీ సాహోలో హిందీ వర్షన్ కు ప్రభాస్ చేతే డబ్బింగ్ చెప్పించాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. కానీ ప్రభాస్ మాత్రం ఆలోచనలో పడ్డాడట. తనకు హిందీ వచ్చినప్పటికి యాస మాత్రం దక్షణాది తరహాలోనే ఉంటుంది. అందువల్ల తాను డబ్బింగ్ చెబితే నార్త్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ప్రభాస్ ఆలోచిస్తున్నాడట. 

హిందీ వర్షన్ కు కూడా తన వాయిసే కరెక్ట్ అని చిత్ర యూనిట్ మొత్తం భావిస్తే డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధం అని అంటున్నాడట. ప్రభాస్ ప్రస్తుతం నార్త్ ఆడియన్స్ కి తగ్గట్లుగా హిందీలో శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. కానీ చివరి నిమిషంలో ప్రభాస్ డబ్బింగ్ చెప్పే సాహసం చేస్తాడో లేక ఎందుకొచ్చిన రిస్క్ లే అని సైలెంట్ అయిపోతాడో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios