Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్, ప్రయాణం ఎక్కడికంటే..?

యూరోప్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే పీరియాడిక్ లవ్ స్టోరీ. జాతకాలు, జ్యోతిష్యాలు చుట్టూ తిరిగే కథ. అలాగే స్క్రిప్ట్ కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమా హిందీ వెర్షన్‌ని, తెలుగుని సెపరేట్‌గా షూట్ చేస్తున్నారట.  

Prabhas Heads to A Short Vacation
Author
Hyderabad, First Published Sep 23, 2019, 11:48 AM IST

సాహో సినిమా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు ఆనందించాలో, బాధపడాలో అర్దంకాని సిట్యువేషన్ క్రియేట్ చేసింది. హిందీలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ నష్టాలను మిగిల్చింది. ఈ నేపధ్యంలో కొద్ది గా రెస్ట్ తీసుకుని తదుపరి ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.దాంతో   ప్రభాస్ ..ప్యారిస్ కు ప్రయాణం పెట్టుకున్నారు. ఎక్కువ రోజులు అక్కడ ఉండరని చెప్తున్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనపడ్డారు.  ఇందుకు సంభందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మరో ప్రక్క తన తదుపరి చిత్రం జాను విషయంలో ప్రభాస్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా స్క్రిప్టు విషయంలో ఆయన కొన్ని సీన్స్ రీరైట్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అవసరాన్ని బట్టి ఇప్పటివరకు తీసిన సినిమా ఫుటేజ్ మొత్తాన్ని వదిలేసి మళ్ళీ ఫ్రెష్‌గా సినిమా స్టార్ట్ చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.అంతేకాదు తన హెయిర్ స్టైల్ లో మార్పులు చేస్తున్నారు. రోజు జిమ్ లో గంటలు తరబడి కష్టపడాలని ఫిక్స్ అయ్యారు. ఇక అవన్నీ ప్యారిస్ టూర్ నుంచి వచ్చాక జరగనున్నాయి.

ఇక జాను సినిమా విషయానికి వస్తే... యూరోప్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే పీరియాడిక్ లవ్ స్టోరీ. జాతకాలు, జ్యోతిష్యాలు చుట్టూ తిరిగే కథ. అలాగే స్క్రిప్ట్ కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమా హిందీ వెర్షన్‌ని, తెలుగుని సెపరేట్‌గా షూట్ చేస్తున్నారట.  ఒకే లొకేషన్‌లో, ఒకే సీన్‌ని రెండు సార్లు తీస్తారు. దానికి తోడు  హిందీ కోసం కొన్ని సీన్స్‌ని సెపరేట్‌గా షూట్ చెయ్యబోతున్నారు అని కూడా తెలుస్తుంది. ఇన్ని జాగ్రత్తలతో ప్రభాస్ ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios