Asianet News TeluguAsianet News Telugu

సుజీత్ పద్దతిగా ప్లాన్ చేశాడు.. బాహుబలికి చేయని రిస్క్ సాహోలో!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సాహో టీజర్ కోసం అభిమానుల నిరీక్షణకు తెరపడింది. కొన్ని గంటల క్రితమే సాహో టీజర్ ని చిత్ర యూనిట్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళీ భాషల్లో విడుదల చేశారు.

Prabhas Dubs for Hindi Saaho teaser
Author
Hyderabad, First Published Jun 13, 2019, 2:39 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సాహో టీజర్ కోసం అభిమానుల నిరీక్షణకు తెరపడింది. కొన్ని గంటల క్రితమే సాహో టీజర్ ని చిత్ర యూనిట్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళీ భాషల్లో విడుదల చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు సాహో టీజర్ లోని యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, ప్రభాస్ స్టైల్ కు ఫిదా అవుతున్నారు. కథ గురించి చిన్న క్లూ కూడా దొరకకుండా సుజీత్ టీజర్ ని చాలా పద్దతిగా ప్లాన్ చేశాడు. 

టీజర్ ఆరంభంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ మధ్య లవ్ సీన్, ఆ తర్వాత భారీ స్థాయిలో విలన్ సెటప్, ఆయుధాలు, ప్రభాస్ స్టైలిష్ లుక్ ని కొంచెం కొంచెం చూపిస్తూ సుజిత్ టీజర్ ని కట్ చేశాడు. ఇక చివర్లో ప్రభాస్ శైలిలో ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ అంటూ ఫన్నీగా శ్రద్దా కపూర్ తో సంభాషణ ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులు థియేటర్స్ లో సీట్ల అంచున కూర్చుని ఉత్కంఠగా చూసే బైక్ ఛేజింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. 

మాస్ ప్రేక్షకులని సంతృప్తి పరిచే విధంగా చివర్లో భీకరమైన బాడీ టూ బాడీ ఫైట్ సీన్ కూడా ఆకర్షిస్తోంది. మొత్తంగా నిర్మాతలు కేటాయించిన బడ్జెట్ కు న్యాయం చేస్తూ సుజీత్ సాహో చిత్రాన్ని తెరకెక్కించినట్లే ఉన్నాడు. బాహుబలి చిత్రంలో చేయని రిస్క్ ని ప్రభాస్ సాహో కోసం చేస్తున్నట్లు ఉన్నాడు. టీజర్ కు ప్రభాస్ హిందీలో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. 

హిందీ టీజర్ లో 'మై హోనా' అనే డైలాగ్ ని మనం వినొచ్చు. ఇక సినిమా మొత్తానికి ప్రభాస్ హిందీలో డబ్బింగ్ చెబుతున్నాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. గతంలో ప్రభాస్ చేత హిందీలో డబ్బింగ్ చెప్పించాలని సుజీత్ ప్రయత్నించాడట. తనకు హిందీ వచ్చినప్పటికీ నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే యాసలో తాను డైలాగులు చెప్పగలనా అనే సందేహాన్ని ప్రభాస్ వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. ఒక వేళ ప్రభాస్ సాహో చిత్రం మొత్తానికి డబ్బింగ్ చెప్పి ఉంటే అది కూడా సాహసమే.  

Follow Us:
Download App:
  • android
  • ios