Asianet News TeluguAsianet News Telugu

‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ కు ప్రభాస్ బర్త్ డే విషెస్.. ఫ్యాన్స్ మాత్రం కోపంగా ఉన్నారే!

‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ పుట్టిన రోజు సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తన బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ‘ఆదిపురుష్’పైనా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
 

Prabhas birthday wishes to director Om Raut!
Author
First Published Dec 21, 2022, 1:14 PM IST

‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ కు డార్లింగ్  ప్రభాస్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఓం పుట్టిన రోజు కావడంతో తన ఇస్టా స్టోరీలో స్పెషల్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదిపురుష్ పైనా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం అంతకంతకూ ఆలస్యం అవుతూ వస్తోంది. ఆ మధ్య విడుదలైన ఆదిపురుష్ టీజర్ తో విమర్శలపాలు కావడంతో పాటు.. విజువల్స్ చాలా చెత్తగా ఉన్నాయంటూ సినీ ప్రియులు తేల్చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా నిరాశకు గురయ్యారు.

దీంతో మళ్లీ వీఎఫ్ఎక్స్ పైనా వర్క్ చేస్తున్నారు. మునపటి టీంను తొలగించి.. కొత్త టీమ్ తో వర్క్ చేయిస్తున్నారు. ఖర్చు పెరిగినా థియేటర్లలో విజువల్ వండర్ ను చూపించేలా రూపొందిస్తున్నారు. దీంతో రిలీజ్ డేట్ ను కూడా వాయిదా వేశారు. వచ్చే ఏడాది జనవరి 12కు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం.. జూన్ లో విడుదల చేసేలా షెడ్యూల్ చేశారు. కానీ వీఎఫ్ ఎక్స్ కు మరింత మరింత సమయం పడుతుండటంతో  2024లో సినిమా రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ కూడా ‘ఆదిపురుష్’టీంకు సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది. 

తాజాగా బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు ఓం రౌత్. ఆదిపురుష్ లో మీరు పరిచయం చేయబోయే ప్రపంచాన్ని చూసేందుకు వేచి ఉన్నాను’ అంటూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ఆలస్యంగా వచ్చినా ‘ఆదిపురుష్’ బెస్ట్ అవుట్ పుట్ తో రావాలని ప్రభాస్ సూచించినట్టు తెలుస్తోంది. ఓం రౌత్ పుట్టిన రోజు కూడా ఫ్యాన్స్ ఆయనకు హార్ట్ ఫుల్ గా విష్ చేయలేకపోతున్నారు. ఇసారైనా గట్టి కంటెంట్ తో.. అదిరిపోయే విజువల్స్ రావాలని కొందరు ఫ్యాన్స్ కోరుతున్నారు. మరికొందరూ గతంలో వచ్చిన టీజర్ వర్క్ ను గుర్తు చేస్తూ మండిపడుతున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే 300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ప్రభాస్ - క్రితి సనన్ జంటగా నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణనుడి పాత్రలో అలరించబోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios