Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ 7హౌజ్ నుంచి పూజా మూర్తి ఎలిమినేటెడ్.? వరుసగా ఏడుగురు లేడీ కంటెస్టెంట్స్

బిగ్ బాస్ హౌజ్ నుంచి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్ కన్ఫమ్ అయ్యింది.  సీరియల్ నటి పూజా మూర్తి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వెళ్లబోతోంది. 
 

Pooja Murthy Eliminated from The Bigg Boss House!
Author
First Published Oct 21, 2023, 1:13 PM IST

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఏడో సీజన్ ను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే 49రోజులు పూర్తైంది. ఈ సీజన్ ముందుగా చెప్పినట్టుగానే ఉల్టా పుల్టాగానే సాగుతోంది. బిగ్ బాస్ ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు. ఈ క్రమంలో హౌజ్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సెకండ్ లాంచ్ తో పలువురు కంటెస్టెంట్లను హౌజ్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో సీరియల్ నటి పూజా మూర్తి (Pooja Murthy)  హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 

అయితే, ఇప్పటికే హౌజ్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్ ను వీడిన విషయం తెలిసిందే. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభశ్రీ, నయని పావని ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇక ఈ వారం నామినేషన్లలో ఏడుగురు నిలిచారు. అశ్విని, భోలే, అమర్ దీప్, గౌతమ్, పల్లవి, ప్రశాంత్, అశ్విని, పూజా మూర్తి, తేజా ఉన్నారు. శుక్రవారం ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. తాజాగా హౌజ్ నుంచి పూజా మూర్తి ఎలిమేనేషన్ కన్ఫమ్ అయ్యింది. ఈరోజు హౌజ్ ను వీడనుంది. 

ఇక పూజా మూర్తి..  సీరియల్ నటిగా బుల్లితెర ప్రేక్షకుల్లో కాస్తా గుర్తింపు తెచ్చుకుంది. పలు సీరియర్లలో లీడ్ రోల్ లో నటించి మెప్పించింది. బిగ్ బాస్ 7 సీజన్ ప్రారంభంలోనే హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనా.. తన తండ్రి అకాల మరణంతో వెనక్కి వెళ్లింది. ఆమె తండ్రి కోరిక మేరకు మళ్లీ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తనదైన శైలిలో గేమ్ ఆడి.. చివరికు ఎలిమినేషన్ అయ్యింది.

Follow Us:
Download App:
  • android
  • ios