Asianet News TeluguAsianet News Telugu

పర్శనల్ లైఫ్: పూజ హెగ్డే ఆదివారం ఎక్కడ గడిపిందంటే...

  స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే వారణాసిలో వెళ్లింది. ఆదివారం ఆమె అక్కడ గంగా హారతిలో పాల్గొంది. వాటిని వీడియోగా తీసి ఇనిస్ట్రాలో షేర్ చేసింది. హారతిలో పాల్గొనేటప్పుడు ఆమె చాలా సింపుల్ గా ఉంది.  

Pooja Hegde takes part in Ganga aarti at Varanasi
Author
Varanasi, First Published Oct 4, 2021, 7:58 AM IST

తెలుగులో ఓ పెద్ద హీరోతో సినిమా అనుకోగానే మొదట గుర్తు వచ్చే హీరోయిన్ పూజ హెగ్డే. ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా...ఆమెకు ఉన్న గుర్తింపు వేరే. ఆమెకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌... మార్కెట్‌ అలాంటిది. అందుకే స్టార్ హీరోలు, డైరక్టర్స్ తరచూ ఆమెతోనే ముందుకు వెళ్లటానికి ఆసక్తి చూపుతూంటారు.  అందుకే అతి తక్కువటైమ్ లో మహేష్‌బాబు, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌... ఇలా స్టార్‌ హీరోలందరితోనూ జోడీ కొట్టేసింది పూజాహెగ్డే. ఇక మిగిలింది పవన్‌కల్యాణే. త్వరలోనే ఆయనతోనూ పూజా జోడీ కొట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ చిత్రంలో పవన్‌ సరసన పూజాహెగ్డేనే ఆడిపాడనుందని సమాచారం. ఇంత బిజీలోనూ ఆమె పర్శనల్ లైఫ్ కు ప్రాధాన్యత ఇస్తూంటుంది.  స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే వారణాసిలో వెళ్లింది. ఆదివారం ఆమె అక్కడ గంగా హారతిలో పాల్గొంది. వాటిని వీడియోగా తీసి ఇనిస్ట్రాలో షేర్ చేసింది. హారతిలో పాల్గొనేటప్పుడు ఆమె చాలా సింపుల్ గా ఉంది.  

ఇక ప్రస్తుతం ఆమె ‘బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రం చేసింది. అఖిల్‌ అక్కినేని-పూజాహెగ్డే జంటగా నటించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ ..  పూజా గురించి స్పందిస్తూ.. పని పట్ల ఆమెకు ఎంతో అంకితభావం ఉందని.. ఒకేసారి ఆరు సినిమా షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నప్పటికీ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంతో సరదాగా షూట్‌లో పాల్గొంది అని అఖిల్‌ అన్నారు.

  దర్శకుడు భాస్కర్‌.. పూజాహెగ్డే గురించి మాట్లాడుతూ ‘మా సినిమా ఒక యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇందులో పూజాహెగ్డే స్టాండప్‌ కమెడియన్‌ రోల్‌లో కనిపించనున్నారు. అయితే, హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేసుకున్న తర్వాత.. ‘ఆమెకు ఉన్న స్టార్‌డమ్‌ని పక్కనపెడితే ఇందులో ఆమె రోల్‌ ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అందులోనూ స్టాండప్ కమెడియన్‌ చాలా క్లిష్టమైన పాత్ర. ఒకవేళ ఆమె సరిగ్గా చేయకపోతే ఏం చేయాలి’ అని నిర్మాత బన్నీ వాసుని అడిగాను. షూట్‌ ప్రారంభించిన తర్వాత ఆమెకు ఉన్న డెడికేషన్‌ చూసి నేను ఫిదా అయ్యాను. ఆమె చాలా బాగా నటిస్తుందని బన్నీవాసుకి చెప్పాను’ అని అన్నారు.

పూజాహెగ్డే  నటించిన సినిమాలు ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్‌’... ఇలా వరుసగా విడుదల కానున్నాయి. ఆమె జోరు తెలుగులోనే అనుకుంటే పొరపాటు. హిందీ, తమిళంలోనూ అవకాశాలు అందుకుంటూ అదరగొడుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios