బాలీవుడ్ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ 'RX 100' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ 'RX 100' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఒక్క సినిమాతో ఆమె యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకుంది.
అందంతో పాటు చక్కటి అభినయం కనబరిచే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటుంది.
ఈ క్రమంలో తాజాగా తన చిన్నప్పటి ఫోటోని అందరితో పంచుకుంది. స్కూల్ డేస్ లో దిగిన ఫోటో అంటూ క్యూట్ ఫోటోని షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు చాలా క్యూట్ గా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ వెంకీ సరసన 'వెంకీ మామ' సినిమాలో నటిస్తోంది.
Scroll to load tweet…
