పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ ప్రక్కన ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తూ ..మరో ప్రక్క ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరక్షన్ లో మరో  సినిమాలోను నటిస్తున్న సంగతి తెలిసిందే.  రెగ్యులర్  షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సీన్స్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. సముద్రంలో ఓడలో తరలిపోతున్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే ఫైట్ ని పవన్ పై  షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలువనుందని తెలుస్తోంది.

ఇక  అయితే ఈ ఫైట్ కు స్ఫూర్తి ఏదైనా ఉందా? అంటే.. `షాడో ఫైటర్` అనే పాపులర్ వీడియో గేమ్ ద్వారా ప్రేరణ పొందారని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో పవన్ వ్యతిరేకులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులు పెట్టి మరీ హైలెట్ చేస్తున్నారు. చేస్తే రీమేక్ ..లేకపోతే ఫ్రీమేక్ అంటూ వెటకారం చేస్తున్నారు. అయితే ఈ యాక్షన్ పార్ట్ అభిమానులకు అదిరిపోయే కిక్ ఇస్తుందని అంటున్నారు. థియేటర్ లో ఈ ఫైట్ వచ్చినటప్పుడు విజిల్స్ పడడం ఖాయం అంటున్నారు సినిమావాళ్లు.

మొఘలుల కాలం నాటి చారిత్రక నేపధ్యంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని   ఏఎం రత్నం  నిర్మిస్తున్నారు. ఇందుకోసం భారీ బడ్జెట్ ని వెచ్చిస్తున్నారని సమాచారం. ఈయన ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇప్పటికే క్రిష్ ఫ్లాప్స్ లో ఉండటంతో... పవన్ కళ్యాణ్ ని ముంచుతాడా తేలుస్తాడా ..అన్న డైలమాలో ఫ్యాన్స్ ఉన్నారట. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.