Asianet News TeluguAsianet News Telugu

పవన్ ఈ నెల నుంచే షూట్ మొదలు,ఉసూరుమన్న ఫ్యాన్స్

 పవన్ కళ్యాణ్,  సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ రాగా ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్  వచ్చేసింది.

Pawan Kalyan #VinodayaSitham film shoot starts from Jan 27th
Author
First Published Jan 18, 2023, 12:30 PM IST

మెగా ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్న ఒక  ఇంట్రస్టింగ్ రూమర్ మరికొద్ది రోజులో నిజం కాబోతోంది.  మెగా ఫ్యామిలీలో ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి,  రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినా,  ఆ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సమయంలో వారికి ఊరటనిచ్చేలా పవన్ కళ్యాణ్,  సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ రాగా ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్  వచ్చేసింది.

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ చిత్తం అనే సినిమా రీమేక్ తెలుగులో చేస్తారని అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  సుప్రీం స్టార్ సాయిధరమ్ తేజ కలిసి నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. నటుడు,  దర్శకుడు అయిన సముద్రఖని తమిళ్ లో తెరకెక్కిన వినోదయ చిత్తంలో ఆయన నటించిన పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ చేత నటింపచేస్తున్నారనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఆ మధ్యన  ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి.  ఈ నెల (జనవరి) 27 నుంచి షూటింగ్ మొదలు కానుందని సమాచారం. తన మేనల్లుడు కోసమే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కిస్తకున్నట్లు తెలుస్తోంది. 

ఇక  ఈ సినిమాకు సముద్రఖని స్వయంగా దర్శకత్వం వహించబోతున్నారు.  సినిమా షూటింగ్ త్వరగా  పూర్తి చేసి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కు ఈ వార్త రుచించటం లేదు. చాలా మంది అభిమానులు ఈ సినిమా చేయవద్దని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలా షూటింగ్ మొదలు కానుందని తెలియగానే వారంతా ఉసూరుమంటున్నారు. త్రివిక్రమ్ దగ్గరుండి ఇదతా చేయిస్తున్నారని ఆయనపై మండిపడుతున్నారు. 

ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి ప్రారంభమై పోయిన నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ కుదిరిన వెంటనే సినిమా షూటింగ్ ప్లాన్ చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ గా  క్లారిటీ రావాల్సి ఉంది. సముద్రఖని దర్శకత్వంలో తనే ముఖ్యపాత్ర పోషించిన ఈ సినిమాలో తంబి రామయ్య మరో కీలక పాత్ర పోషించాడు. ఇదో సోషియో ఫాంటసీ మూవీ. హాలీవుడ్ క్లాసిక్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తరహాలో సాగే వినోద భరితమైన సినిమా ఇది.  నిజానికి ఇదే స్టోరీ లైన్ తో వివిధ భాషల్లో సినిమాలొచ్చాయి. ఇంతకు ముందు తెలుగులో మంచు విష్ణు, నాగార్జున ప్రధాన పాత్రల్లో పి. వాసు తెరకెక్కించిన ‘కృష్ణార్జున’ స్టోరీ లైన్ కూడా అదే. అయినా సరే ఈ తమిళ చిత్రాన్ని పవర్ స్టార్ తో తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నారని టాక్. దీనికి త్రివిక్రమ్ తనదైన స్టైల్లో  స్క్రీన్ ప్లే , సంభాషణలు అందించబోతున్నారని టాక్. 

వాస్తవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు చేయడం ఆపేస్తా అని ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో తిరిగి సినిమాలు చేయడానికి ఒప్పుకుని అందులో భాగంగానే వకీల్ సాబ్,  భీమ్లా నాయక్ సినిమా విడుదల కాగా ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో  హరిహర వీరమల్లు షూట్ చేస్తున్నారు. తరువాత హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో ఓ చిత్రం, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios