Asianet News TeluguAsianet News Telugu

డైరక్టర్ సెంటిమెంట్ కు ఓకే చెప్పిన పవన్ ?

కొంతకాలం పాటు త్రివిక్రమ్ అదే పద్దతిలో సమంతతో జర్నిచేసారు. ఆ తర్వాత పూజ హెడ్గేని వరసగా తన సినిమాలో తీసుకుంటున్నారు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా అదే స్కీమ్ ఫాలో అవుతున్నట్లుంది. ఆయన కూడా పూజ హెడ్గేతో వరస సినిమాలు చేస్తున్నారు. 

Pawan Kalyan To Romance Pooja Hegde?
Author
Hyderabad, First Published Aug 26, 2020, 12:34 PM IST

సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. కోట్లతో నడిచే బిజినెస్ కాబట్టి ఎవరూ తప్పు పట్టరు కూడా. ముఖ్యంగా దర్శకులకు కాంబినేషన్ సెంటిమెంట్స్ ఉంటాయి. అందుకే చాలా మంది దర్శకులు తమ హీరోయిన్స్ ని రిపీట్ మోడ్ లో లాగుతూంటారు. కొంతకాలం పాటు త్రివిక్రమ్ అదే పద్దతిలో సమంతతో జర్నిచేసారు. ఆ తర్వాత పూజ హెడ్గేని వరసగా తన సినిమాలో తీసుకుంటున్నారు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా అదే స్కీమ్ ఫాలో అవుతున్నట్లుంది. ఆయన కూడా పూజ హెడ్గేతో వరస సినిమాలు చేస్తున్నారు. అయితే హీరోలు...ఆ సెంటిమెంట్ ని గౌరవించినప్పుడే చెల్లుబాటు అవుతుంది. హరీష్ శంకర్ సెంటిమెంట్ ని పవన్ ఓకే చెప్పినట్లు సమాచారం.

హ‌రీష్ శంక‌ర్ ప్ర‌స్తుతం ప‌వ‌న్   కోసం ఓ స్క్రిప్టు త‌యారు చేస్తున్నాడు. మైత్రీ మూవీస్ సంస్థ  నిర్మించే ఈ చిత్రంలో... హీరోయిన్ గా పూజా హెగ్డేని తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో హ‌రీష్ తెర‌కెక్కించిన డీజేలో పూజా హీరోయిన్. ఆ త‌ర‌వాత గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌లోనూ త‌న‌నే తీసుకున్నాడు. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా పూజానే రిపీట్ చేయ‌బోతున్నాడ‌ని వినిపిస్తోంది. దానికి తోడు.... ప‌వ‌న్ - పూజాలు కాంబినేష‌న్ బాగుంటుంది కూడాను. పవన్ కూడా ఓటేసేరాని వినికిడి.

టాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో దూసుకపోతున్న స్టార్‌ అండ్‌ క్రేజీ హీరోయిన్‌ పూజా హెగ్డే. సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే ఈ బట్టబొమ్మకు ఉండే ఫాలోయింగ్‌, క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది తెలుగులో ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని అందకున్న పూజా ప్రస్తుతం ప్రభాస్‌, అఖిల్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios