`సాహో` ఫేమ్‌ సుజిత్‌తో పవన్‌ ఓ సినిమా చేయబోతున్నట్టు కొన్ని రోజులుగా వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమానే రేపు అధికారికంగా ప్రకటించబోతున్నారట. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి జోరు పెంచుతున్నారు. ఇప్పటికే `హరిహర వీరమల్లు` చిత్ర షూటింగ్‌ లో పాల్గొంటున్న ఆయన ఇప్పుడు అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. అనూహ్యంగా మరో కొత్త సినిమా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే పవన్‌ చేయాల్సిన సినిమాలు నాలుగున్నాయి. ఇప్పుడు ఇంకో సినిమాని ప్రకటించబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఓ రకంగా పవన్‌ మరోసారి దూకుడు పెంచబోతున్నారని చెప్పొచ్చు. 

`సాహో` ఫేమ్‌ సుజిత్‌తో పవన్‌ ఓ సినిమా చేయబోతున్నట్టు కొన్ని రోజులుగా వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమానే రేపు అధికారికంగా ప్రకటించబోతున్నారట. `ఆర్‌ఆర్‌ఆర్‌` వంటి భారీ సినిమాని అందించిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని తెరకెక్కించబోతుందని సమాచారం. అయితే ఈ నిర్మాణ సంస్థ తాజాగా ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. రేపు(ఆదివారం) బిగ్‌ అనౌన్స్ మెంట్‌ అని వెల్లడించింది. రేపు ఉదయం 8.55గంటలకు ప్రకటించబోతున్నట్టు ట్వీట్‌ చేశారు. 

అయితే ఇది పవన్‌-సుజిత్‌ల సినిమానే అని తెలుస్తుంది. పవన్‌, సుజిత్‌లతో డివివి దానయ్య సినిమా నిర్మించబోతున్నారని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అదే ఇప్పుడు ప్రకటించనున్నారని అంటున్నారు. రేపు అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ని ప్రకటిస్తారని, త్వరలోనే ప్రారంభం కూడా ఉంటుందని అంటున్నారు. షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది పక్కన పెడితే ఇప్పుడు పవన్‌ కొత్త సినిమా అనౌన్స్ మెంట్‌ అనే వార్త అభిమానులను ఊపేస్తుంది. వారిలో పూనకాలు లోడ్‌ చేస్తుందని అంటున్నారు. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే ఇది పవన్‌ ఎప్పుడూ చేయని మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని, ఓ రేంజ్‌ మాస్‌ ఫిల్మ్ గా, భారీ యాక్షన్‌ ప్యాక్డ్ గా ఈ చిత్ర కథని సుజిత్‌ రాసుకున్నారని అంటున్నారు. ఇక ప్రస్తుతం పవన్‌ `హరిహర వీరమల్లు` షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీంతోపాటు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో `భవదీయుడు భగత్‌సింగ్‌` చిత్రం చేయాల్సి ఉంది. రెండేళ్లుగా హరీష్‌ శంకర్‌ ఈ ప్రాజెక్ట్ కోసం వెయిట్‌ చేస్తున్నారు. అలాగే సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాల అనంతరం సుజిత్‌ది ఉంటుందా? లేక అన్ని పక్కన పెట్టి ఈ సినిమానే పట్టాలెక్కిస్తారా? అనేది ఆసక్తి రేకెత్తిస్తున్న, సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తుంది.