Asianet News TeluguAsianet News Telugu

అకిరా నందన్ హ్యాండ్సమ్ పిక్, వింటేజ్ పవన్ గుర్తు చేస్తున్న మెగా వారసుడు

ఈమధ్య బాగా  వార్తల్లో నిలుస్తున్నాడు మెగా వారసుడు.. పవర్ స్టార్ తనయుడు అకీరా నందన్. హైటు,పర్సనాలిటీ, అటీట్యూడ్ తో మెగాఫ్యాన్స్ ను ఊరిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు కుర్రాడు స్క్రీన్ పై ఉర్రూతలూగిస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Pawan Kalyan Son Akira Nandan New Vintage Look Viral In Social Media  JMS
Author
First Published Feb 25, 2024, 8:42 AM IST

అకీరా నందన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు మెగా ప్యాన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా ఎంట్రీ కోసంవెయ్యి కళ్లుతో వెయిట్  చేస్తున్నారు. అటు అకీరా కూడా అందుకు సిద్దం అవుతున్నట్టుగానే తెలుస్తోంది. అదేం లేదు ని రేణు దేశాయ్ బుకాయించినా.. అకీరా లో ఛేంజ్.. న్యూ మేకోవర్ స్పస్టంగా కనిపిస్తోంది. హీరోగా తనను ఎవరూ వేలెత్తి చూపకుండా అన్నింట ట్రైయినింగ్ అవుతున్నాడు చిన్నోడు.  

అంతే కాదు ఈమధ్య కనిపిస్తున్న ఫోటోలలో అకీరాలో పిల్లాడి లుక్ పోయింది. హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. డ్రెస్సింగ్  దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకూ అన్నింటినీ బాగా మెయింటేన్ చేస్తున్నాడు. బాగా కనిపిస్తున్నాడు కూడా. రీసెంట్ గా జరిగిన మెగా సంక్రాంతి వేడుకల్లో కూడా అకీరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇక తాజాగా మరోసారి అకీరా నందన్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అచ్చం కుర్రతనంలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ను చూసతున్నట్టు ఉంది అంటున్నారు ఫ్యాన్స్. 

Pawan Kalyan Son Akira Nandan New Vintage Look Viral In Social Media  JMS

తాజాగా అకిరా నందన్ లేటేస్ట్ ఫోటోను రేణూ దేశాయ్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అకిరా, ఆద్యలకు ఇద్దరికి ఓ సలహా ఇచ్చానని.. తన మాటను అకిరా పాటిస్తున్నాడని మురిసిపోయింది. ఇప్పుడు అందరూ ట్రెండీ బ్లూ టూత్.. వైర్ లెస్ బ్లూ టూత్ వాడుతున్నారని… ఇలాంటివి వాడితే బ్రెయిన్ కు ఏదైనా సమస్య రావొచ్చని.. వైర్ తో ఉండే హెడ్ సెట్స్ ఉపయోగించాలని రేణూ దేశాయ్ సలహా ఇచ్చారట. 

అయితే అమ్మ మాటను వెంటనే ఆచరణలో పెట్టాడట ముద్దుల కొడుకు..  అమ్మ చెప్పిన మాటను వింటూ వైర్ హెడ్ సెట్ వాడటం స్టార్ట్ చేశాడట. ఇక ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ.. అకిరా వైర్ హెడ్ సెట్ వాడుతున్న ఫోటోను షేర్ చేసింది రేణు దేశాయ్. అయితే ఆమె ఈ విషయం చెప్పడానికి ఫోటో పెట్టినా..? అకీరా హ్యాండ్సమ్ లుక్ వైరల్ అవుతోంది. అకిరా న్యూలుక్ చూసి సంబరపడి పోతున్నారు ఫ్యాన్స్. లాంగ్ హెయిర్.. హైట్.. స్టైల్ చూసి వింటెజ్ పవర్ స్టార్‏లాగా కనిపిస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

ఎప్పుడెప్పుడు తనుఇండస్ట్రీకి వస్తాడా అని ఎదురు చూస్తున్నట్టు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్వరగా హీరోగా ఇండస్ట్రీలోకి రావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్ పెండింగ్ లో ఉండగా...? ఆయన మాత్రం ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. ఇక  రేణూ దేశాయ్.. చాలా ఏళ్ల తరువాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. లాస్ట్ ఇయర్  రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాలో... హేమలత లవణం పాత్రలో కనిపించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios