పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు మానేసి పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఏపీ ఎన్నికల్లో తన జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు మానేసి పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఏపీ ఎన్నికల్లో తన జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇది ఇలా ఉండగా.. తనకుఆస్తుల కంటే అప్పులే ఎక్కువని చెప్పే పవన్ ఇప్పుడు కొత్తగా ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. హైదరాబాద్ లోని మాదాపూర్ సమీపంలో పవన్ ఓ ఇల్లు కట్టిస్తున్నాడు. ఈ నెల 6న గృహ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఎన్నికల హడావిడిలో పవన్ బిజీగా ఉన్నప్పటికీ ఆ ఒక్కరోజు తీరిక చేసుకొని గృహప్రవేశ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. పవన్ బిజీగా ఉండడంతో ఇంటికి సంబంధించిన పనులన్నీ అతడి మిత్రుడు త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నాడని టాక్.

గృహప్రవేశ వేడుకను వీలైనంత సింపుల్ గా కానిచ్చేస్తారట. అతి కొద్ది మంది ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. సినిమా వాళ్లు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.