ఎట్టకేలకు హరి హర వీరమల్లు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు పవన్ కళ్యాణ్. ఈ చిత్ర వర్క్ షాప్ లో పాల్గొంటున్న పవన్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

హరి హర వీరమల్లు చిత్రానికి అడుగడునా అడ్డంకులే. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ కొన్నాళ్ళు వాయిదా పడింది. పరిస్థితులు సద్దుమణిగాక చకచకా పూర్తి చేద్దాం అనుకుంటే పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. అలాగే హరి హర వీరమల్లు రషెస్ చూసిన పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారని, స్క్రిప్ట్ లో మార్పులు సూచించారని ప్రచారం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5 నుండి ఏపీలో బస్సు యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో హరి హర వీరమల్లు అటకెక్కినట్లే అని అందరూ భావించారు. 

అనూహ్యంగా పవన్ బస్సు యాత్ర వాయిదా వేశాడు. ఈ కారణంగా హరి హర వీరమల్లు పూర్తి చేసే అవకాశం దక్కింది. హరి హర వీరమల్లు చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ తో దిగిన లేటెస్ట్ ఫోటో ట్విట్టర్ లో షేర్ చేశారు. 'హరి హర వీరమల్లుతో.. నవరాత్రుల్లో నవ ఉత్తేజం' అంటూ కామెంట్ పెట్టారు. ఇక సదరు ఫొటోలో హరి హర వీరమల్లు షెడ్యూల్ వర్క్ షాప్ అని రాసి ఉన్న ఫ్లెక్సీ కనిపించింది. 

Scroll to load tweet…

అంటే హరి హర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతుందని, పవన్ కళ్యాణ్ దానికి సంబంధించిన వర్క్ షాప్ లో ప్రస్తుతం పాల్గొంటున్నారని ఒక ఐడియా వచ్చింది. ఈ మధ్య పొలిటికల్ మీటింగ్స్ పక్కన పెట్టిన పవన్ సూపర్ గ్లామరస్ గా కనిపించారు. రెడ్ టీషర్ట్, జీన్స్ ధరించి హ్యాండ్ సమ్ లుక్ లో అదరగొట్టారు. పవన్ లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది. 

హరి హర వీరమల్లు చిత్రానికి క్రిష్ దర్శకుడు కాగా... ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. అలాగే పవన్ వినోదయ సిత్తం అనే రీమేక్ ప్రకటించారు. ఈ గ్యాప్ లో ఆ చిత్రాన్ని కూడా ఆయన పూర్తి చేసే అవకాశం కలదు. ఎందుకంటే వినోదయ సిత్తం రిమేక్ కి పవన్ కేవలం 25 రోజుల డేట్స్ మాత్రమే కేటాయించినట్లు సమాచారం. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ ఆయన కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. డేట్స్ ఇస్తే భవదీయుడు భగత్ సింగ్ పూర్తి చేయాలని ఆశపడుతున్నారు. ఫ్యాన్స్ సైతం భవదీయుడు భగత్ సింగ్ మూవీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.