ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఓజి చిత్రం గురించి ప్రతి చిన్న విషయం కూడా హైప్ పెంచే విధంగా ఉంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఓజి చిత్రం గురించి ప్రతి చిన్న విషయం కూడా హైప్ పెంచే విధంగా ఉంది. డైరెక్టర్ సుజీత్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డాన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి లాంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ కి జోడిగా ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఓజి చిత్రానికి ఆరంభంలోనే ఆకాశాన్ని తాకే హైప్ నెలకొంది. గతంలో ఈ స్థాయి హైప్ అజ్ఞాతవాసికి ఉండేది. దర్శకుడు సుజీత్ అందరిని సర్ప్రైజ్ చేసే విధంగా అద్భుతమైన స్టైలిష్ యాక్షన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రం నుంచి వస్తున్న లీకులు, అప్డేట్స్ పవన్ ఫ్యాన్స్ ని కుదురుగా ఉండనీయడం లేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన యుఎస్ బిజినెస్ డీల్ ని నిర్మాతలు క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఓజి ఓవర్సీస్ హక్కులని 2.9 మిలియన్ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది మైండ్ బ్లోయింగ్ ప్రైజ్ అనే చెప్పాలి. 

అజ్ఞాతవాసి తర్వాత ఓవర్సీస్ లో ఆ రేంజ్ రేటు పలికిన పవన్ చిత్రం 'ఓజి'నే. యుఎస్ లో పవన్ కి ఇది సెకండ్ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అని అంటున్నారు. ఓజి చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా బయ్యర్లు అంత మొత్తం వెచ్చించి హక్కులు సొంతం చేసుకునేందుకు వెనుకాడలేదు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. 

ఇక త్వరలో పవన్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఫ్యాన్స్ కి ధమాకా ట్రీట్ ఉండబోతోంది. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే అనే సంగతి తెలిసిందే. పవన్ బర్త్ డే రోజున ఓజి టీం మాసివ్ ట్రీట్ ప్లాన్ చేశారు. ఆరోజు చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.