పవన్ మరో రీమేక్ చేయడానికి సిద్దమయ్యారనేది లేటెస్ట్ టాక్.అట్లీ దర్సకత్వంలో విజయ్ హీరోగా 2016లో విడుదలైన చిత్రం తేరి(Theri). సమంత, అమీ జాక్సన్ హీరోయిన్స్ నటించిన తేరి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
భీమ్లా నాయక్ (Bheemla Nayak)బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఇక ఓపెనింగ్స్ కూడా భారీగా దక్కడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ భీమ్లా నాయక్ కి నేటి నుండి అసలు పరీక్ష మొదలుకానుంది. భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ దక్కించుకున్న భీమ్లా నాయక్ వీకెండ్ వరకు ఢోకా లేకుండా వసూళ్లు సాధించింది. వీకెండ్ ముగియడంతో భీమ్లా నాయక్ ఎంత వరకు ఆడియన్స్ ని థియేటర్స్ వద్దకు రప్పించగలడు అనేది చూడాలి. నైజాం లో భీమ్లా నాయక్ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది.
కాగా పాలిటిక్స్ కారణంగా మూడేళ్లు విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఆయన అరడజను చిత్రాల వరకు ప్రకటించారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ విడుదల కాగా.. హరిహర వీరమల్లు షూటింగ్ జరుపుకుంటుంది. హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డితో మరో చిత్రానికి పవన్ సైన్ చేశారు. కొద్దిరోజుల క్రితం తమిళ్ హిట్ మూవీ వినోదయ సితం చేయడానికి పవన్ ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటించనున్న ఈ మల్టీస్టారర్ దాదాపు ఖాయమేనట.
అయితే పవన్ మరో రీమేక్ చేయడానికి సిద్దమయ్యారనేది లేటెస్ట్ టాక్.అట్లీ దర్సకత్వంలో విజయ్ హీరోగా 2016లో విడుదలైన చిత్రం తేరి(Theri). సమంత, అమీ జాక్సన్ హీరోయిన్స్ నటించిన తేరి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తెలుగులో పోలీసోడు పేరుతో అందుబాటులోకి వచ్చింది ఈ చిత్రం. కాగా తేరీ చిత్రాన్ని పవన్ రీమేక్ చేయనున్నారట. ఈ రీమేక్ కి సాహో (Sahoo)ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్నారట. ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించనున్నారట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయనేది టాలీవుడ్ వర్గాల బోగట్టా.
మరి ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చిన నేపథ్యంలో మరోసారి పవన్ ని పవర్ ఫుల్ పోలీస్ గా చూసే అవకాశం ఫ్యాన్స్ కి దక్కినట్లే. మరోవైపు పోలీస్ కథల రీమేక్స్ పవన్ కి బాగా కలిసొస్తున్నాయి. దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్, అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ భీమ్లా నాయక్ పాజిటివ్ ఫలితాలు ఇచ్చాయి. అయితే విజయ్ చిత్రాలకు తెలుగులో ఆదరణ పెరగడంతో తేరి డబ్బింగ్ వర్షన్ పోలీసోడు చాలా మంది చూశారు. అందరికీ పరిచయమైన చిత్రాన్ని మరలా పవన్ తీస్తారా లేదా అనేది ఒక సందేహం.
అధికారికంగా పవన్ మూడు చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. తమిళ్ రీమేక్ తో పాటు, తేరి రీమేక్ ప్రచారంలో ఉన్న ప్రాజెక్ట్స్. ఈ రెండింటిపై ప్రకటన రావాల్సి ఉంది. హరి హరి హర వీరమల్లు ఈ ఏడాది విడుదల కానుంది. దర్శకుడు క్రిష్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. నిధి అగర్వాల్, జాక్విలిన్ పెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
