వకీల్ సాబ్ మూవీ మరో ఐదురోజుల్లో విడుదల కానుంది. వకీల్ సాబ్ ఏప్రిల్ 9న థియేటర్స్ లో దిగనున్నారు. వకీల్ సాబ్ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా నేడు పవన్ అభిమానులు వకీల్ సాబ్ కవర్ ట్రైలర్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో ఒకరైన షకలక శంకర్ పై ఈ కవర్ ట్రైలర్ తెరకెక్కింది. పవన్ మాదిరి, ముగ్గురు అమ్మాయిలను కాపాడడం కోసం న్యాయపోరాటం చేసే లాయర్ గా షకలక శంకర్ కనిపించారు. 


ఇక ట్రైలర్ ముగిశాక ఓ ఫ్యాన్ గా తన అభిమానం చాటుకున్నారు. ట్రైలర్ కోసం థియేటర్స్ దగ్గర సందడి చేసిన ఫ్యాన్స్ చూపిస్తూ అభిమానం అంటే అది అని చెప్పాడు. పవన్ అభిమానులు థియేటర్ అద్దాలు పగులగొట్టిన వీడియో చూపిస్తూ... కావాలని ఎవరైనా చేస్తారా, అనుకోకుండా జరిగిందని ఫ్యాన్ గా వారిని సమర్ధించారు. ట్రైలర్ కే అద్దాలు బద్దలైతే.. సినిమాకు బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం అని షకలక శంకర్ తెలిపారు. 


కొద్దిసేపటి క్రితం విడుదలైన వకీల్ సాబ్ కవర్ ట్రైలర్ నెట్ లో హల్చల్ చేస్తుంది. హిట్ సాంగ్స్ కి కవర్ సాంగ్స్ చేయడం ఆనవాయితీగా ఉంది. అయితే మొదటిసారి వకీల్ సాబ్ చిత్రం ద్వారా కవర్ ట్రైలర్ కూడా చేయడం జరిగింది. వకీల్ సాబ్ ట్రైలర్ విపరీతమైన ఆదరణ దక్కించుకోగా, అనేక సోషల్ మీడియా రికార్డ్స్ బద్దలు కొట్టింది. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా,  థమన్ సంగీతం అందించారు.