Asianet News TeluguAsianet News Telugu

పవన్ చేతులు మీదుగా జనసేన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభంకానుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జనసేన తరఫున ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పాలని నిర్ణయించారు.  ఈ మేరకు  ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పాలకొల్లులో తెలుగు పరిశ్రమ లెజెండ్‌ ఎస్వీ రంగారావు పేరుతో ఈ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తామని అందులో పేర్కొంది. 
 

Pawan Kalyan establishing film institue in Palakollu
Author
Hyderabad, First Published Jul 1, 2019, 8:04 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభంకానుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జనసేన తరఫున ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పాలని నిర్ణయించారు.  ఈ మేరకు  ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పాలకొల్లులో తెలుగు పరిశ్రమ లెజెండ్‌ ఎస్వీ రంగారావు పేరుతో ఈ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తామని అందులో పేర్కొంది. 

అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ లాంటి ఉద్దండులను సినీ రంగానికి అందించిన ఘనత పాలకొల్లుకు దక్కుతుందని ఆ ప్రకటనలో గుర్తు చేసింది. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసుల నేతృత్వంలో నడిచే  ఈ ఇన్‌స్టిట్యూట్‌కి ఛైర్మన్‌గా హరిరామజోగయ్య వ్యవహరిస్తారు. నటన, దర్శకత్వ విభాగాల్లో ఈ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. 

రాజా వన్నెంరెడ్డి దీనికి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తారు. నటన, దర్శకత్వం, ఇతర విభాగాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ త్వరలో సిద్ధం కానుంది. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios