పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ బ్రో బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్ర వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు.  

బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో మూవీ స్ట్రగుల్ అవుతుంది. చెప్పాలంటే బ్రో థియేటరికల్ రన్ దాదాపు ముగిసినట్లే. వీక్ డేస్ స్టార్ట్ అయ్యాక బ్రో మూవీ తేలిపోయింది. వసూళ్లు 80-90 శాతం పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రో కలెక్షన్స్ పరిశీలిస్తే మొదటి రోజు రూ. 23.6 కోట్ల షేర్ అందుకుంది. సెకండ్ డే రూ. 10.47 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక మూడో రోజు ఆదివారం కూడా రూ. 10.48 కోట్లు కొల్లగొట్టింది. 

అంటే సెకండ్ డేనే యాభై శాతానికి పైగా వసూళ్లు పడిపోయాయి. నిజానికి బ్రో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ షో నుండే ఫ్యాన్స్ సినిమా అద్భుతం అంటూ ట్రెండ్ చేశారు. అయితే సాధారణ ప్రేక్షకులకు బ్రో మూవీ నచ్చలేదని తేలిపోయింది. వీకెండ్ వరకూ నెట్టుకొచ్చిన బ్రో సోమవారం కుప్పకూలిపోయింది. నాలుగో రోజు రూ. 2.36 కోట్లు షేర్ అందుకుంది. రోజు రోజుకూ వసూళ్లు పడిపోతూ వచ్చాయి. 7వ రోజు ఏపీ/తెలంగాణలలో బ్రో కేవలం రూ. 60 లక్షల షేర్ వసూలు చేసింది. 

ఫస్ట్ వీక్ ముగిసే నాటికి బ్రో మూవీ ఏపీ/తెలంగాణాలలో కలిపి రూ. 50.71 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రాన్ని రూ. 81 కోట్లకు అమ్మినట్లు సమాచారం. దాదాపు మరో రూ. 30 కోట్లు వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. వరల్డ్ వైడ్ బ్రో రూ. 97 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ షేర్ దాదాపు రూ. 60 కోట్లు. కాబట్టి బ్రేక్ ఈవెన్ కావాలంటే మిరాకిల్ జరగాల్సిందే. నిజానికి ఈ వారం కూడా బ్రో మూవీదే. ఏమాత్రం సినిమాలో కంటెంట్ ఉన్నా రెండు వారాలు దుమ్ము దులిపేది. 

ఒక మోస్తరు సినిమా కూడా ఈ శుక్రవారం విడుదల కాలేదు. ఈ పరిణామాన్ని బ్రో కాకుండా బేబీ క్యాష్ చేసుకుంటుంది. అందుకే బేబీ టీమ్ విజయ యంత్రాలంటూ రెండు రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. కాబట్టి భోళా శంకర్ వచ్చే వరకు బేబీ హవా నడిచే అవకాశం ఉంది. బ్రో మూవీ వినోదాయసితం రీమేక్ గా తెరకెక్కింది. సముద్రఖని దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ మాటలు, కథనం సమకూర్చారు. 

బ్రో మూవీ ఏపీ/తెలంగాణ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 

Day 1: 23.61 కోట్లు 
Day 2: 10.47కోట్లు
Day 3: 10.48కోట్లు
Day 4: 2.36కోట్లు
Day 5: 1.68కోట్లు
Day 6: 1.06కోట్లు
Day 7: 60 లక్షలు

AP-TG Total:- 50.71 కోట్లు (79.75 కోట్ల గ్రాస్)

ప్రీ రిలీజ్ బిజినెస్ - 80.50 కోట్లు