రాయలసీమ జానపద రచయిత, గాయకుడు శ్రీ పెంచల్ దాస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. నాని హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన కృష్ణార్జున యుద్ధం మూవీతో సింగర్ గా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ మూవీలో పెంచల్ దాస్ పాడిన 'దారి చూడు' సూపర్ డూపర్ హిట్. 


ఆ తరువాత ఆయన ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ మూవీలో ఓ పాట పాడారు. క్లైమాక్స్ లో వచ్చే 'ఊరీకి ఉత్తారానా...' అనే సాంగ్ ఆకట్టుకుంది. అలాగే శర్వానంద్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శ్రీకారం చిత్రంలో శర్వానంద్ కూడా ఓ పాట పాడడం జరిగింది.  

పెంచల్ దాస్ గారు రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్నీ నేటి తరానికి చేరువ చేస్తున్న విధానం అభినందనీయం అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గీత రచయిత, గాయకుడు శ్రీ పెంచల్ దాస్ గారు మంగళవారం హైదరాబాద్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ సందర్భంగా తెలుగు జానపదాలు, సీమ మాండలికంపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ చర్చలో ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు పాల్గొన్నారు. అనంతరం శ్రీ పెంచల్ దాస్ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సత్కరించారు.