Asianet News TeluguAsianet News Telugu

వెటకారాలు తగ్గించుకోవాలంటూ శ్రీ సత్యకి పేరెంట్స్ వార్నింగ్‌.. ఆమెతో జాగ్రత్త అంటూ ఫైమా తల్లి హెచ్చరిక..

ఫ్యామిలీ మెంబర్స్ ని పంపిస్తూ సర్ప్రైజ్‌ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత వారిని చూడటంతో కంటెస్టెంట్లు, అటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీంతో ఎమోషనల్‌గా మారిపోతుంది బిగ్‌ బాస్‌ షో. 

parents warning to sri satya and faima mother also warn to her in bigg boss 6 telugu
Author
First Published Nov 23, 2022, 11:36 PM IST

బిగ్‌ బాస్‌ 6 తెలుగు పన్నెండో వారాన్ని ఆద్యంతం ఎమోషనల్ గా మార్చేశాడు బిగ్‌ బాస్‌. ఇంటి సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ని పంపిస్తూ సర్ప్రైజ్‌ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత వారిని చూడటంతో కంటెస్టెంట్లు, అటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీంతో ఎమోషనల్‌గా మారిపోతుంది బిగ్‌ బాస్‌ షో. అయి మొదట కంటెస్టెంట్లని కాసేపు ఆడుకున్నారు బిగ్‌ బాస్‌, ఫ్రీజ్‌, ఫార్వర్డ్, రివైండ్‌, స్నూప్‌ చేయిస్తూ కామెడీని పండించారు. ఈ గేమ్‌లో ఇంటి సభ్యులు చేసే పనులు ఆద్యంతం సందడిగా సాగడంతోపాటు నవ్వులు పూయించాయి. 

అందులో భాగంగా బుధవారం ఎపిసోడ్‌ తొలుత ఫైమా తల్లిని పంపించారు. చాలా జోవియల్‌గా ఉండే తన తల్లిని చూసి ఆనందంలో ఉప్పొంగిపోయింది ఫైమా. హగ్‌ చేసుకుని ముద్దులు పెట్టింది. అందరితోనూ ఫ్రీగా మాట్లాడారు. తాము ఒకప్పుడు ఎన్నో కష్టాలుపడ్డామని, కానీ ఇప్పుడు నా కూతురు సంపాదిస్తుంటే తాము తింటున్నామని, చాలా గర్వంగా ఉందని తెలిపింది. బయట జనంచూసి తనని గుర్తుపడుతున్నారని, సెల్ఫీలుకూడా తీసుకుంటున్నారని చెప్పడంతో ఫైమా ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఈ సందర్బంగా ఎటకారాలు తగ్గించుకోవాలని తెలిపింది. జెన్యూన్‌గా ఆడాలని తెలిపింది. ఇక పోయే ముందు అందరితో కలిసి డాన్సు చేసింది ఫైమా తల్లి. ఆద్యంతం హౌజ్‌లో ఎనర్జీని తీసుకొచ్చింది.

ఫైమా తల్లి వెళ్లిపోయాక శ్రీహాన్‌, శ్రీసత్య కలిసి గార్డెన్‌ ఏరియాలో మాట్లాడుకున్నారు. తమ మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా శ్రీసత్య.. శ్రీహాన్‌కి మంచి ఆఫర్‌ ఇచ్చింది. రెండు గుడ్లు ఇస్తానని, చికెన్‌ ఇస్తానని తెలిపింది. ఎమోషన్స్ ని గుడ్డుతో లెక్క కడతావా అంటూ శ్రీహాన్‌ కామెంట్‌ చేశారు. కాసేపు శ్రీహాన్‌ని బుంజగించే ప్రయత్నం చేసింది శ్రీసత్య. 

అనంతరం శ్రీ సత్య వాళ్ల అమ్మానాన్నవచ్చారు. పక్షవాతంతో కాళ్లు,చేయిపడిపోయి వాళ్లమ్మ వీల్‌ చైర్‌కే పరిమితమైంది. దీంతో ఆమెని తీసుకుని శ్రీ సత్యనాన్న హౌజ్‌లోకి వచ్చి ఆమెని సర్‌ప్రైజ్‌ చేశారు. అమ్మని అలా చూసి శ్రీసత్య  భావోద్వేగానికి గురయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ల నాన్న, అమ్మలు కూడా ఏడ్చారు. ఈ సందర్భంగా గేమ్ అంతా బాగాఆడుతున్నారని తెలిపారు. అదే సమయంలో మొదట్లో చాలా బాగా ఉండేదాన్ని వని, ఇప్పుడు ఎటకారాలు ఎక్కువయ్యాయి, నడుము తిప్పుడాలు చేస్తున్నావని వాటిని తగ్గించుకోవాలని వార్నింగ్‌ ఇచ్చారు ఆమె తండ్రి. వాళ్లు చికెన్‌ ఫ్రై వంటి పలు ఐటెమ్స్ ని పంపించగా సభ్యులంతా ఎగబడి తినేశారు.

అనంతరం బిగ్‌ బాస్‌ కోచింగ్‌ సెంటర్లు సింగింగ్‌ క్లాస్‌ నిర్వహించారు. రాజ్‌ టీచర్‌ గా వ్యవహరించారు. ఇతర సభ్యులతో సింగింగ్ ప్రాక్టీస్‌ చేయించారు. మొదట ఫైమాతో ప్రాక్టీస్‌చేయించారు. అయితే ఆమెతో పాట పాడించే ప్రయత్నం చేయగా, ఇది నవ్వులు పూయించింది. ఆ తర్వాత శ్రీహాన్‌తో పాడించాడు. వారి గాత్రాన్నితట్టుకోలేక సభ్యులంతా పడిపోవడంతో నవ్వులు విరిసాయి.

మరోవైపు చివర్లో రోహిత్‌కి సర్‌ప్రైజ్‌ వచ్చింది. వాళ్ల అమ్మ వచ్చి సర్ప్రైజ్‌ చేసింది. అమ్మని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు రోహిత్‌. మెరీనాతో దిగిన మొదటి సెల్ఫీని సైతం పంపించగా, అదిచూసి, మెరీనాని గుర్తు చేసుకుని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే మధ్య మధ్యలో ఫ్రీజ్‌, రివైండ్‌ గేమ్‌తో షోని రక్తికట్టేలా చేశారు బిగ్‌ బాస్‌. ఆయనే లీడ్‌ తీసుకున్నారు. ఈ గేమ్‌ టైమ్‌లో ఫ్రీజ్‌లో ఉన్నప్పుడు ఆయా కంటెస్టెంట్లకి మేకప్లు వేయడంవిశేషం. ఇందులో భాగంగా శ్రీహాన్‌కి లేడీ గెటప్‌ వేయడం మరింత రక్తికట్టించింది.

Follow Us:
Download App:
  • android
  • ios