విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పరశురాం 'గీత గోవిందం' అనే పెద్ద హిట్ సినిమాను రూపొందించాడు. ఆ సినిమా తరువాత మరే సినిమా ఓకే చేయలేదు ఈ డైరెక్టర్. మహేష్ తో సినిమా చేయడం కోసం కథ రెడీ చేశాడు.

కానీ ఆ స్టోరీ అల్లు అరవింద్ కి నచ్చకపోవడంతో వేరే బ్యానర్ లో చేయడం కోసం ప్రయత్నించాడు. కానీ మహేష్ బాబు లిస్ట్ లో వరుస సినిమాలు ఉండడంతో మరో హీరో కోసం వేట మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మరోసారి విజయ్ దేవరకొండ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

విజయ్ కి లైన్ చెప్పి ఓకే చేయించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'గీత గోవిందం' కాంబినేషన్ అంటే క్రేజ్ ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కానీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ తో సినిమా చేస్తున్నాడు.

మరోపక్క విక్రమ్ కె కుమార్ స్క్రిప్ట్ వినడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో పరశురాంతో సినిమాకు ఎంత ఛాన్స్ ఉంటుందనేది చెప్పలేని పరిస్థితి. మరేదైనా చిన్న సినిమా చేద్దామంటే.. పరశురాం రెమ్యునరేషనే ఐదు కోట్ల వరకు ఉంటుంది. మరి పరశురాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!