జాన్వీ కపూర్ నటించిన `పరమ్ సుందరి` సినిమా ఆదివారం సాయంత్రం వరకు ₹8.14 కోట్లు వసూలు చేసి, మొత్తం కలెక్షన్ ₹24.64 కోట్లకు చేరుకుంది.
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన `పరమ్ సుందరి` సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లని సాధిస్తోంది. ఈ సినిమా ఉత్తరాది అబ్బాయి, దక్షిణాది అమ్మాయి ప్రేమకథ. ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే సినిమా నెమ్మదిగా పుంజుకోవడం విశేషం. కలెక్షన్ల పరంగా సత్తా చాటుతోంది.
Sacnilk నివేదిక ప్రకారం, `పరమ్ సుందరి` సినిమా మూడో రోజు (మొదటి ఆదివారం) సాయంత్రం 8 గంటల వరకు ₹8.14 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం కలెక్షన్స్ ₹24.64 కోట్లకు చేరుకున్నాయి.
జాన్వీ కపూర్ మొదటి సినిమా `ధడక్` మూడో రోజు (ఆదివారం) ₹13.92 కోట్లు వసూలు చేసింది. `పరమ్ సుందరి` సినిమా సాయంత్రం 8 గంటల వరకు ₹8.14 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆదివారం రాత్రికి ₹10 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. కానీ ధడక్ సినిమా మొదటి ఆదివారం వసూళ్లను దాటడం కష్టమే.
`పరమ్ సుందరి` బాక్సాఫీస్ కలెక్షన్స్:
రోజు 1 (శుక్రవారం)- ₹7.25 కోట్లు
రోజు 2 (శనివారం)- ₹9.25 కోట్లు
రోజు 3 (ఆదివారం)- ₹8.14 కోట్లు (సాయంత్రం 8 గంటల వరకు)
మొత్తం- ₹24.64 కోట్లు (ప్రాథమిక అంచనా)
`పరమ్ సుందరి` సినిమా ₹70 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో నిర్మాణ ఖర్చులు, నటీనటుల పారితోషికం, సంగీతం, ప్రచారం వంటివి ఉన్నాయి. సినిమాలోని సన్నివేశాలు, సెట్స్, పాటల కోసం ఎక్కువ ఖర్చు చేశారు.
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రచారం కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేశారు. సినిమా గురించి చాలా చర్చ జరిగింది. కానీ బడ్జెట్ వసూలవుతుందా, బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందా అనేది చూడాలి. కలెక్షన్లు మాత్రం డీసెంట్‌గా ఉన్నాయి. సోమవారం వసూళ్లని బట్టి ఈ మూవీ సక్సెస్ దిశగా వెళ్తుందా? లేక ఫ్లాప్‌గా మిగిలిపోతుందా అనేది చూడాలి. ఇంతకంటే కలెక్షన్లు తగ్గితే మాత్రం హిట్ కావడం కష్టమే. ఈ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు.
