Asianet News TeluguAsianet News Telugu

పెళ్ళిపై ఎట్టకేలకు నోరు విప్పిన ప్రభాస్, సల్మాన్ ఖాన్ తో తన పెళ్ళి లింక్ పెట్టిన యంగ్ రెబల్ స్టార్

తన పెళ్లి విషయంలో ఎట్టకేలకు నోరు విప్పాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పెళ్లి విషయంలో కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కాని పెళ్లి గురించి ప్రభాస్ చెప్పిన ఆన్సర్ కు ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు. 

Pan India Hero Prabhas Clarity about Marriage
Author
First Published Dec 19, 2022, 6:31 PM IST

దేశంలో అత్యంత అభిమానించే  హీరోల్లో  ప్రభాస్ ఒకరు.  టాలీవుడ్ లోనే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగిపరోయింది. అంతే కాదు విదేశాలలో కూడా ప్రభాస్ కు వీరాభిమానులు ఉన్నారు అంతకంతకు ఫాలోయిన్ ను.. ఇమేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు ప్రభాస్.  అయితే ఆయన అభిమానుల్లో ఒక్క విషయంలోనే ప్రభాస్ లోటు చేస్తున్నాడు. పెళ్లి చేసుకుని.. జూనియర్ ప్రభాస్ ను ఎప్పుడు చూపిస్తాడా అని ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

ఈక్రమంలో ప్రస్తుతం ఆదిపురుష్ లో నటించిన ప్రభాస్.. ఈ మూవీ హీరోయిన్ కృతి సనన్‌తో డేటింగ్ లో ఉన్నాడంటూ  పుకార్లు సూపర్ ఫాస్ట్ గా షికారు చేశాయి. అయితే అలాంటిదేమి లేదు...మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కృతి కూడా క్లారిటీ ఇచ్చింది. ఇక గతంతో కూడా అనుష్కను  ప్రభాస్ పెళ్ళాడబోతున్నాడంటూ వార్తలుగుప్పుమన్నాయి. అమెరికాలో సొంత ఇల్లు కూడా కొన్నారంటూ.. వార్తలు హల్ చల్ చేశాయి. ఈక్రమంలో ఇన్నాళ్లు తన పెళ్ళిపై డైరెక్ట్ గా స్పందించనిప్రభాస్.. ఇప్పుడు స్పందించక తప్పలేదు. 

చాలా సార్లు ప్రభాస్ కు ఈ ప్రశ్న ఎదురయినా..? ప్రభాస్ మాత్రం లైట్ తీసుకున్నాడు. కాని ఈసారి స్టార్ సీనియర్ హీరో బాలకృష్ణ ముందు బుక్ అయ్యాడు యంగ్ రెబల్ స్టార్ ఈసారి సమాధానం చెప్పక తప్పలేదు.  అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2 లో, నందమూరి బాలకృష్ణ ప్రభాస్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడిగాడు, దానికి అతను సల్మాన్ ఖాన్ తర్వాత అని ఫన్నీగా  సమాధానం ఇచ్చాడు. 

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఆయన నటిస్తున్నఆదిపురుష్, సలార్ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ ల ఉండగా..ప్రజక్ట్ కె మూవీ మాత్రం నిదానంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. మరో వైపు సందీప్ రెడ్డితో స్పిరిట్, పట్టాలెక్కాల్సి ఉంది. మారుతీ డైరెక్షన్ లె డీలక్స్ రాజా షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. మరికొన్ని కథలు ప్రభాస్ హోల్డ్ లో పెట్టినట్టుసమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios