Asianet News TeluguAsianet News Telugu

‘ప‌లాస 1978’ దర్శకుడి నెక్ట్స్ మూవీ ఖరారు, హీరో ఎవరంటే!

కుల వివక్ష ఆధారంగా తెలుగులో  తెర‌కెక్కిన ఈ  ‘ప‌లాస 1978’ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పించిందో తెలిసిందే. 1978 ప్రాంతంలో శ్రీకాకుళంలో జిల్లాలోని ప‌లాస‌లో జ‌రిగిన కొన్ని నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన చిత్ర‌మిది. అప్పటి రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను ఉన్న‌త కులాలు, త‌క్కువ కులాలు అని వేరు చేసి చూస్తూండటంపై వచ్చిన ఈ చిత్రం లాక్ డౌన్ సమయంలో రిలీజ్ కావటంతో అర్దాంతరంగా ఆగిపోయింది. అయితే ఆ దర్శకుడు కరుణ కుమార్ కు మంచి పేరు రావటంతో ఆయన్ని ఓ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది.

Palasa 1978 director next with Dr Rajasekhar
Author
Hyderabad, First Published Jun 7, 2020, 9:21 AM IST

కుల వివక్ష ఆధారంగా తెలుగులో  తెర‌కెక్కిన ఈ  ‘ప‌లాస 1978’ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పించిందో తెలిసిందే. 1978 ప్రాంతంలో శ్రీకాకుళంలో జిల్లాలోని ప‌లాస‌లో జ‌రిగిన కొన్ని నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన చిత్ర‌మిది. అప్పటి రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను ఉన్న‌త కులాలు, త‌క్కువ కులాలు అని వేరు చేసి చూస్తూండటంపై వచ్చిన ఈ చిత్రం లాక్ డౌన్ సమయంలో రిలీజ్ కావటంతో అర్దాంతరంగా ఆగిపోయింది. అయితే ఆ దర్శకుడు కరుణ కుమార్ కు మంచి పేరు రావటంతో ఆయన్ని ఓ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు సీనియర్ హీరో రాజశేఖర్ ని డైరక్ట్ చేసే అవకాసం ఇచ్చారు. ఈ మేరకు చర్చలు జరిగి, ఓ కథ ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.

పలాస తరహాలోనే ఇంతకు ముందు ఎన్నడూ తెలుగు తెరపై రాని ఒక విభిన్నమైన సోషల్ డ్రామా సినిమాను రాజశేఖర్ తో కరుణ కుమార్ తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఈ సినిమా సైతం పీరియాడిక్ నేపథ్యంలోనే సాగుతుందంటున్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తూ ఫైనల్ వెర్షన్ రెడీ చేస్తున్నారట. అయితే ఇంకా ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు.

ఇక ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న రాజశేఖర్ ..గత కొన్నాళ్లుగా భాక్సాఫీస్ దగ్గర నిరాశ పర్చుతూనే ఉన్నాయి. ఆ మధ్యన గరుడవేగ కాస్త ఆయనకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినా ఆ తర్వాత వచ్చిన కల్కి సినిమా మళ్లీ నిరాశే మిగిల్చింది. అందుకే కరుణ కుమార్ తో విభిన్నమైన సినిమాకు రాజశేఖర్ రెడీ అయ్యాడని చెప్తున్నారు. జీవిత రాజశేఖర్ ఈ సినిమాని నిర్మించనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios