Asianet News TeluguAsianet News Telugu

మీ వ్యవహారంలోకి పాకిస్తాన్‌ను లాగొద్దు: కంగనాపై పాక్ జర్నలిస్ట్ ఫైర్

ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయాన్ని బీఎంసీ కూల్చివేయడంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్, బాబర్ సైన్యం అనే మాటలను వాడుతూ ఉద్దవ్ సర్కార్‌పై కంగనా మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేసింది. 

Pakistani journalist Mehr Tarar gets brutally trolled after post on Kangana Ranaut
Author
Mumbai, First Published Sep 10, 2020, 4:15 PM IST

ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయాన్ని బీఎంసీ కూల్చివేయడంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్, బాబర్ సైన్యం అనే మాటలను వాడుతూ ఉద్దవ్ సర్కార్‌పై కంగనా మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేసింది.

తాజాగా ఈ వ్యవహారంలోకి పాకిస్తాన్ జర్నలిస్టు వచ్చి చేరారు. మన పొరుగుదేశంలో జర్నలిస్టుగా పనిచేస్తున్న మెహర్ తారార్ అనే మహిళ కంగనపై విరుచుకుపడ్డారు.

ముంబైని పీఓకేతో పోలుస్తూ కంగన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెహర్.. దయ చేసి ఈ వ్యవహారంలోకి పాకిస్తాన్ పేరును లాగొద్దని హితవు పలికారు. తమ దేశంలో జాతీయ స్థాయి వ్యక్తుల ఇళ్లు లేదా కార్యాలయాలు కూల్చడం జరగదని ట్వీట్ చేశారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే నెటిజన్లు మెహర్‌ను, పాకిస్తాన్‌ను ట్రోల్ చేయడం మొదలెట్టారు. ‘‘ అవును మెహర్.... మీరు చెప్పింది నిజమే.. పాకిస్తాన్‌లో ఇళ్లు లేవు, కార్యాలయాలు సైతం కూల్చివేయబడవు. కేవలం మైనారిటీల మత ప్రదేశాలను కూల్చడానికి మాత్రమే జనం గుమిగూడతారని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.

మీకు జాతీయ స్థాయి నేతలు.. దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయిద్, సలావుద్దీన్, ఒసామా బిన్ లాడెన్, ఇమ్రాన్ ఖాన్‌లేనా అని మరొకరు ప్రశ్నించారు. ‘పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో.. తమకు తెలుసునని, మీ దేశంలో చంపబడటమో, అదృశ్యమవ్వడమో జరుగుతుందని ఇంకో నెటిజన్ అన్నాడు. 

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios