ప్రస్తుతం ప్రపంచం మొత్తం సినీ అభిమానులు అవతార్ 2 చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. జేమ్స్ కామెరూన్ సృష్టించిన పండోర ప్రపంచం విజువల్స్ చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం సినీ అభిమానులు అవతార్ 2 చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. జేమ్స్ కామెరూన్ సృష్టించిన పండోర ప్రపంచం విజువల్స్ చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఇది ఒకరకమైన కొత్త అనుభూతి. మరో ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ ఒళ్ళు గగుర్పాటుకి గురయ్యే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై రెండు అణు బాంబులు పడ్డాయి. దీనితో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నారు. 'ఓపెన్ హైమర్' చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది.
విజువల్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. అణుబాంబు తయారీ సమయంలో ఓపెన్ హైమర్ మానసిక స్థితి ఎలా ఉంది.. అణుబాంబు తయారీ వెనుక ఎంత శ్రమ జరిగింది.. ఎలా ప్రయోగించారు లాంటి డీటెయిల్స్ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. అణుబాంబు పేలుతున్నప్పుడు ఆ విస్ఫోటనం విజువల్ భయంకరంగా ఉన్నాయి.
ఆడియన్స్ కి ఒక థ్రిల్లర్ ఫీస్ట్ గ్యారెంటీ అనే విధంగా క్రిస్టఫర్ నోలెన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కిల్లియన్ మర్ఫీ ఈ చిత్రంలో ఓపెన్ హైమర్ పాత్ర పోషిస్తున్నారు. మర్ఫీ ఆ పాత్రలో ఒదిగిపోయి కనిపించాడు. అణుబాంబు పరిమాణం ఎంత ఉంటుంది.. ఎలా ఉంటుంది అనే విజువల్స్ ఈ ట్రైలర్ లో చూడొచ్చు.

