ప్రపంచంలో ప్రఖ్యాత మాస్టర్ స్టోరీ టెల్లర్స్ లో క్రిస్టఫర్ నోలెన్ ఒకరు. నోలెన్ చివరగా టెనెట్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన అత్యంత ఆసక్తికరమైన బయోగ్రఫీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ప్రపంచంలో ప్రఖ్యాత మాస్టర్ స్టోరీ టెల్లర్స్ లో క్రిస్టఫర్ నోలెన్ ఒకరు. నోలెన్ చివరగా టెనెట్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన అత్యంత ఆసక్తికరమైన బయోగ్రఫీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై రెండు అణు బాంబులు పడ్డాయి. దీనితో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నారు. 

ఓపెన్ హైమర్ అణుబాంబు పితామహుడిగా పేరుగాంచారు. ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబు సృష్టించింది ఆయనే. ఒక మహా ప్రాజెక్టు లాగా ఓపెన్ హైమర్ కి అణుబాంబుని తయారు చేసే బాధ్యత అప్పగించారు. ఆ సమయంలో ఓపెన్ హైమర్ లో ఎలాంటి అంతర్మధనం జరిగింది.. ఆయన ఆలోచనలు ఏ రకంగా ఉండేవి.. ప్రజల ప్రాణాల గురించి ఆయన ఆలోచించారా ? ఇలాంటి అంశాలన్నీ ఎమోషనల్ గా ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. 

YouTube video player

ఇది ఒకెత్తయితే అణుబాంబు విజువల్స్ ని క్రిస్టఫర్ నోలెన్ విజువల్ ఫీస్ట్ లాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ట్రైలర్ విడుదల చేయగా.. తాజాగా మరో కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటేనే మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. ఇక కంప్లీట్ మూవీలో అణుబాంబు విజువల్స్, డ్రామా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కిల్లియన్ మర్ఫీ ఈ చిత్రంలో ఓపెన్ హైమర్ పాత్ర పోషిస్తున్నారు. మర్ఫీ ఆ పాత్రలో ఒదిగిపోయి కనిపించాడు. జూలై 21న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ప్రపంచం మొత్తం ఈ చిత్రం కోసం ఎదురుచూస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు.