Asianet News TeluguAsianet News Telugu

ఆర్ ఆర్ ఆర్ టీమ్ సైకిల్ రైడ్... కేక అంటున్న నెటిజెన్స్!

ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలై ఏడాది అవుతుండగా టీమ్ స్పెషల్ ఫోటోలు విడుదల చేశారు. సదరు ఫోటోలో జక్కన్న, ఎన్టీఆర్, రామ్ చరణ్ సైకిల్ రైడ్ చేస్తున్నారు. 
 

one year for rrr movie team releases an unseen pic ksr
Author
First Published Mar 25, 2023, 9:49 PM IST

రాజమౌళి విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ విడుదలై నేటికి ఏడాది. 365 రోజులు గడుస్తున్నా చర్చ జరుగుతూనే ఉంది. ఇక వరల్డ్ వైడ్ ఈ చిత్రం సృష్టించిన రికార్డులు, సాధించిన విజయాలు,లిఖించిన చరిత్ర అనిర్వచనీయం. పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ ఖాతాలో ఆస్కార్ చేసింది. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడం దేశమే గర్వపడిన క్షణం. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ మొట్టమొదటి ఇండియన్ మూవీగా రికార్డులు ఎక్కింది.

ఆస్కార్ తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఆర్ ఆర్ ఆర్ మూవీ కైవసం చేసుకుంది. ఈ సక్సెస్ ని గుర్తు చేసుకుంటూ ఆర్ ఆర్ ఆర్ టీమ్ స్పెషల్ సోషల్ మీడియా పోస్ట్స్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ గెలుచుకున్న అంతర్జాతీయ అవార్డ్స్ వివరాలు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఏడాది గడుస్తున్నా ప్రపంచంలో ఏదో ఒక మూలన ఆర్ ఆర్ ఆర్ మూవీ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో ప్రదర్శించబడుతుందంటూ... కామెంట్ చేశారు.

అలాగే ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో తీసిన అన్ సీన్ పిక్ ఒకటి అభిమానులతో పంచుకున్నారు. సదరు పిక్ లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సైకిల్ రైడ్ చేస్తున్నారు. ఈ ఫోటో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో తీశారని అర్థం అవుతుంది. రామ్ చరణ్ రామరాజు గెటప్ లో ఉన్న నేపథ్యంలో దీనిపై స్పష్టత వస్తుంది. ఆర్ ఆర్ ఆర్ టీమ్ తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది. 

దర్శకుడు రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ రూపొందించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు చేశారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు. డివివి దానయ్య నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ మూవీ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios