హీరోయిన్ తాప్సి బాలీవుడ్ లో తన మార్కు చిత్రాలతో  ముందుకు వెళుతుంది. గత ఏడాది తాప్సి బద్లా, మిషన్ మంగళ్, సంధ్ కి ఆంఖ్ చిత్రాలలో నటించింది. ఆమె నటించిన గేమ్ ఓవర్ థ్రిల్లర్ గా తెలుగు, తమిళ భాషలలో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. 2020లో కూడా తాప్సి తప్పడ్ అనే సోషల్ కాన్సెప్ట్ మూవీలో నటించి మెప్పించారు. విమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. 

ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా కామెంట్స్ కి తాప్సి తరచుగా స్పందిస్తూ ఉంటుంది. వీరిద్దరి మధ్య ఎప్పుడూ మాటల యుద్ధం నడుస్తుంది. సోషల్ మీడియా వేదికగా వీరు ఒకరిని ఉద్దేశిస్తూ మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. సెపోటిజంకి కంగనా వ్యతిరేకం కాగా, తాప్సి ఒకింత మద్దతుగా మాట్లాడుతుంది. తాజాగా హీరోయిన్ తాప్సి మరో మారు చిత్ర పరిశ్రమలోని వారసత్వం గురించి స్పందించారు. 

తాప్సి మాట్లాడుతూ ఇన్సైడర్, ఔట్ సైడర్ అనే చర్చ అనవసరం. స్టార్ కిడ్స్ కి మాత్రమే మంచి సినిమా అవకాశాలు వస్తాయనేది నిజం కాదు. ఎవరి కెరీర్ అయినా ఎంచుకొనే సబ్జెక్ట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. కావున అవకాశాలు అందిపుచ్చుకోవాలి, కెరీర్ ని నిర్మిచుకోవాలి అన్నారు. పరోక్షంగా బాలీవుడ్ లో ఎలాంటి వివక్షత లేదని కంగనా చెప్పడం జరిగింది.