'ఓం భీమ్ బుష్' కలెక్షన్స్ ...ఎంత శాతం రికవరీ అయ్యింది
క్రిందటి వారం బాక్సాఫీసు దగ్గర పెద్దగా పోటీ లేదు. రెండు మూడు సినిమాలు విడుదలైనా స్టార్ హీరోలు నటించినవేవీ లేవు.
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిందటి శుక్రవారం అంటే మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే రిలీజ్ రోజు పెద్దగా ఓపినింగ్స్ తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం మౌత్ టాక్ మెల్లిగా పికప్ అవ్వటం మొదలెట్టింది. మొదటి వారం పూర్తయ్యే సరికి బ్రేక్ ఈవెన్ కి దగ్గరై హిట్ జోన్ లోకి ప్రవేశించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
వర్కింగ్ డేస్ లో కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను ఉన్నా కూడా ఉన్నంతలో బిజినెస్ ను అందుకుంది. ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేపాటికీ ఈ చిత్రం రూ.17 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. అటు ఓవర్సీస్ లో కూడా 250K డాలర్స్ పైగా వసూలు రాబట్టి 1M వైపు పరుగులు పెడుతుంది. మొత్తం మీద 5వ రోజున 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 6వ రోజుకి వచ్చే సరికి సినిమా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ గా 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉నైజాం: 3.10CR~
👉టోటల్ ఆంధ్రా: 3.00CR~
టోటల్ ఆంధ్రా,తెలంగాణా కలెక్షన్స్ :- 6.10CR(11.10CR~ Gross)
👉కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా+ఓవస్ సీస్ -1.95CR
మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 8.05CR(15.25CR~ Gross)
(80% రికవరీ)
10 కోట్ల టార్గెట్ లో 80% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవటానికి ఇంకా 1.95 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా ఆ ప్రభావాన్ని తట్టుకుని భారీ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. క్రిందటి వారం బాక్సాఫీసు దగ్గర పెద్దగా పోటీ లేదు. రెండు మూడు సినిమాలు విడుదలైనా స్టార్ హీరోలు నటించినవేవీ లేవు. రిలీజైన వాటిలో శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రమే చెప్పుకోదగ్గది. ‘సామజవరగమన’తో నవ్వించిన ఆయన మరోసారి కామెడీనే నమ్ముతూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. శ్రీవిష్ణుకి తో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి చేయటం... ట్రైలర్, టీజరక్ ఆసక్తిని రేకెత్తించచడంతో సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ నెలకొన్నాయి.